తిరుపతిలో వున్న 38 ప్రభుత్వ మద్యం షాపులను వెంటనే మూయించండి రాయలసీమ యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ప్రస్తావిస్తూ చిత్తూరు జిల్లాకు చెంది. డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు నారాయణస్వామి వెంటనే మద్యం షాపులను మూయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో ఏ వీదిలోనైనా కరోనా కేసులు 20 దాటితే లాక్ డౌన్ చేస్తున్నారు అలాగే తిరుపతిలో వస్త్ర వ్యాపారస్తులు చాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా మధ్యాహ్నం రెండు గంటలకే షాపులు క్లోజ్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నగర ప్రజలు ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ వినియోగించే కూరగాయల మార్కెట్ సూపర్ మార్కెట్లు పండ్ల దుకాణాలు పాఠశాలలు దేవాలయాలు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. మరీ మద్యం షాపులు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగించడం ప్రభుత్వానికి తగునా,’ అని నవీన్ ప్రశ్నించారు.
తిరుపతి ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా 38 ప్రభుత్వ మద్యం షాపులను రెండు నెలల పాటు వెంటనే మూసివేసేలా ఆదేశాలు ఇవ్వండని ఆయన విజ్జప్తి చేశారు.