అమరావతి : ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన సచివాలయంలో లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారి ఒకవెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇది కర్నూలు జిల్లాలో ఏర్పాటువుతున్నది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 9712 డాక్టర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇవే క్యాబినెట్ నిర్ణయాలు:
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం – నిర్ణయాలు
1.
మరింత మందికి వైయస్సార్ చేయూత, కేబినెట్ కీలక నిర్ణయం
ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తింపు.కేబినెట్ నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్నవారిలో అదనంగా రూ. 8.21 లక్షలమందికి లబ్ధి జరుగుతుందని అంచనా వీరుకాక వైయస్సార్ చేయూత కోసం ఇప్పటివరకూ 17.03 లక్షల మంది దరఖాస్తు వైయస్సార్ చేయూత కింద 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతల్లో రూ. 75వేల రూపాయలు అందించనున్న ప్రభుత్వం. ఏడాదికి రూ.1540.89 కోట్ల చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.6163.59 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
మహిళల ఉపాధి, జీవన ప్రమాణాలను పెంచడంలో ఈ స్కీం ఉపయోగపడుతుందన్న ప్రభుత్వం
2.
నాడు – నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి జీఓ ఎంఎస్ 22కు కేబినెట్ ఆమోదం.మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లు, కాలేజీల్లో నాడు –నేడు కింద అభివృద్ధి పనులు
3.
స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్ ఆమోదం.13 పోస్టులు డిప్యుటేషన్ ప్రాతిపదికన, 1 కాంట్రాక్టు ప్రాతిపదికన, 14 పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మంజూరు
4.
10వేల మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు. దీనికోసం ఏపీ అగ్రికల్యర్ ల్యాండ్ యాక్ట్ –2006 ( కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) సవరణకు కేబినెట్ ఆమోదం.దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం
5
రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ విధానం–2020 కి కేబినెట్ ఆమోదం
రాష్ట్రం వెలుపల రెన్యుబుల్ ఎనర్జీ ఎగుమతికి వీలుగా విధానం
సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తి, ఆ ప్రాజెక్టులకు ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం చర్యలు. ఈ రంగంలో మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు
6.
10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.రైతులకు పగిటిపూట ఉచిత కరెంటు ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ కీలక ప్రాజెక్టులను తీసుకొస్తున్న ప్రభుత్వం.తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చేలా, వీలైనంత ప్రభుత్వంమీద ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందానికి ఆమోదం, 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని నిర్ణయం
7
రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యంపెంపు, కాల్వల విస్తరణ పనులకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌కు కేబినెట్ ఆమోదం
దీనికోసం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణా ప్రాజెక్ట్స్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్)కు కేబినెట్ అంగీకారం
100 శాతం ప్రభుత్వం కంపెనీగా వ్యవహరించనున్న ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ క్యాపిటల్ అవుట్ లే రూ. 40వేల కోట్లు
ఈ డబ్బుతో వరద వచ్చే కాలంలోనే నీటిని తాగు, సాగునీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడానికి పనులు చేపట్టనున్న ప్రభుత్వం
8
గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్ల రూపాయలను విడుదల, దీనికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు సత్వర చర్యలు చేపడుతున్న ప్రభుత్వం
9.
రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి
10.
ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టర్ పోస్టు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం
11.