కరోనా అమానుషం: మృతదేహాన్ని ఫ్యామిలీతో సహా బస్సులోనుంచి దించేశారు

గొంతుపై కణితితో బాధపడుతూ బస్సులోనే ప్రాణాలు విడిచిన మహిళని కరోనా అనుమానం’తో మృతదేహాన్ని రోడ్డుపైనే  కండక్టర్, డ్రైవర్‌ దించేసి అమానుషంగా ప్రవర్తించిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన సోమవారం  వెలుగులోకి తెచ్చింది.
బస్సులో ప్రయాణం మధ్యనే ఈ మహిళ చనిపోయింది. అమె మృతి బస్సులో కలకలానికి దారి తీసింది.ఆమె కరోనా తో మృతిచెందిందని అప్పటికప్పుడు తీర్మానించారంతా. కుటుంబసభ్యులుఆమె చనిపోయిందని కరోనా కాదని, గొంతుమీది కణితితోనని చెప్పినా ఎవరూ వినలేదు. కరోనా  అనుమానంతో ఆమె మృతదేహాన్ని  బస్సులో నుంచి దించేసి డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు వెళ్లిపోయారు తమ దారిన
. కరోనా మనుషుల్ని ఎలా అమానవీకరిస్తుందో రోజు అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల కిందట  తెలంగాణ పెద్దపల్లి ఆసుపత్రిలో చనిపోయిన కరోనా రోగి మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లేందుకు అసుపత్రి సిబ్బంది మునిసిపల్ సిబ్బంది సహకరించకపోతే, డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ స్వయంగా రంగంలోకి దిగి తానే ట్రాక్టర్ నడుపుతూ  స్మశానానికి శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. ఈ సంఘటనకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా చలించారు . డాక్టర్ శ్రీరామ్ కి అభినందనలు ట్వీట్ చేశారు. శ్రీరాం జిల్లా కరోనా సర్వైలెన్స ఆఫీసర్ కూడా.

 

ఈ సంఘటన జరిగిన  24 గంటల లో నే  వికారాబాద్ సంఘటనను సాక్షి దినపత్రిక వెలుగులోకి వచ్చింది. ఈ సంఘనలో మృతురాలికి కరోనా అనేది కేవలం అనుమానం మాాత్రమే.
యాలాల మండలం కిష్టాపూర్‌కు చెందిన గడ్డం చిన్న ఆశప్ప భార్య వెంకటమ్మ (40) గొంతుపై కొన్నేళ్లుగా కణితి ఉంది.అది క్రమంగా పెరుగుతూ ఉండటంతో  శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది.   భోజనం చేసేటపుడు అది బాగా ఇబ్బంది పెడుతూ ఉంది.
కొన్ని రోజుల క్రితం ఆమెకు నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు.  ఆ సందర్భంగా కరోనా పరీక్షలు కూడా చేశారు. ఆమె  నెగెటివ్‌ అని తేలింది.
అయితే,  గొంతు వద్ద కణితి ఆపరేషన్ చేసి తీసేందుకు రూ.2 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు.  భార్యను కాపాడుకోవడానికి ఆశప్ప తనకున్న మూడెకరాల్లో ఎకరం అమ్మి ఆపరేషన్‌ చేయించాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివారం  ఆశప్ప, భార్య వెంకటమ్మ తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆర్టీసీ బస్సులో తాండూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం బయలుదేరాడు.
ఉదయం 10 గంటలకు బస్సులో ప్రయాణిస్తున్నపుడే వెంకటమ్మ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ చనిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న  డ్రైవర్, కండక్టర్‌తో ఇతర  ప్రయాణికులు కరోనాతో ఆమె చనిపోయిందని తీర్మానించారు.
మృతదేహాన్ని బస్సులో నుంచి దించాలని పట్టుబట్టారు.  తన భార్యకు కరోనా లేదని, గొంతులో ట్యూమర్ తో బాధపడుతూ ఉందని , దాని వల్లే ఊపిరాడక చనిపోయిందని, దారి మధ్యలో దించవద్దని ఆశప్ప వాళ్లను బతిమాలాడు. అయితే,బస్సులో ఆశప్పమాట వినేస్థితిలో ఎవరూ లేరు. బస్సులో నుంచి వారిని దించేయాలని పట్టబట్టారు. ఆశప్పకుటుంబ సభ్యుల వేదన,ఏడుపులు ఎవరికీ వినిపించలేదు. వెంకటమ్మ మృతదేహాన్ని కెరెళ్లి  వద్ద  కిందికి దింపి వెళ్లిపోయారు.
ఆశప్ప రోదిస్తూ విషయాన్ని ఫోన్‌లో తన అల్లుడితోపాటు కిష్టాపూర్‌ సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌కు చెప్పాడు. చివరకు ఎలాగో ఓ ఆటో మాట్లాడుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. రోడ్డు పక్క దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న తమ పట్ల ఎవరూ జాలీ, కనికరం చూపలేదని ఆశప్ప విలపిస్తూ చెప్పాడని ‘సాక్షి’ రాసింది.