తిరుపతిలో కరోనా విస్తరిస్తూ ఉండటం, దీనిని ఖాతరుచేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలు కొనసాగిస్తూ ఉండటం వివాదాానికి దారి తీసింది. చిత్తూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా తిరుపతిలో కేసులు పెరుగుతున్నా , తిరుమలకు వస్తున్న భక్తులకు కోరానా లేదని,కేవలం టిటిడి సిబ్బందిలో మాత్రమే కరోనా ఉందని చెప్పి మెల్లిమెల్లిగా టిటిడి దర్శనాలను పెంచుతూపోతూ ఉండటం విమర్శలకు దారితీస్తూ ఉంది.ఈ సమయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ తిరుమలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ వార్త ఎలెక్ట్రానికి మీడియాలో వస్తుండగానే, జిల్లా డాక్టర్ భరత్ గుప్తా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
తిరుమలను రెడ్ జోన్ గా పొరపాటున చేర్చామని వివరణ ఇవ్వడం వెనక పైస్థాయి నుంచి వత్తిడి ఉందని తిరుపతిలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వార్త రాస్తున్నప్పడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనాబులెటీన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో 238 కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల ఇలా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు కనపడగానే పాక్షికంగా లాక్ డౌన్ పెడుతున్నారు. మంగళవారం నుంచి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లలో నిరవధిక పాక్షిక లాక్ డౌన్ విధించారు. ఉదయం ఆరునుంచి పదకొండగంటల దాకా షాపులను అనుమతించి అనంతరం లాక్ డౌన్ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఇది ఇండెఫినిట్ గా కొనసాగుతుందని కూడా అధికారులు ప్రకటించారు.
https://trendingtelugunews.com/top-stories/breaking/partial-lockdown-in-east-godavari-district/
ఇతర చోట్ల పరిస్థితి ఇలా ఉంటే తిరుపతిలో టిటిడి ఇంకా భక్తులను అనుమతించడం ఆందోళన కలిగిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్,తిరుపతి వాసి నవీన్ కుమార్ రెడ్డి.
1) తిరుమల శ్రీవారి ఆన్ లైన్ సేవా టికెట్లను మరి కొద్దిరోజుల పాటు నిలుపుదల చేయడం, 2) తిరుపతిలో మద్యం దుకాణాలను రెండు నెలలపాటు పూర్తిగా మూసివేయడం వల్ల తిరుపతి కరోనా వ్యాప్తిని అదుపు చేయవచ్చని ఆయన అంటున్నారు.
Like this story? Please share it with friends?
తిరుపతి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుపతి “వస్త్ర వ్యాపారస్తుల” సంఘం, “చాంబర్ ఆఫ్ కామర్స్” సంయుక్తంగా నగరంలో అన్ని వ్యాపార వర్గాలు కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం నిర్వహించుకోవాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు, ఇది అభినందనీయం అని చెబుతూ టిటిడి ఉన్నతాధికారులు భేషజాలకు పోకుండా తిరుమల తిరుపతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేయాలి అని నవీన్ రెడ్డి తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. లాక్ డౌన్ సడలించాక జూన్ 11 వ తేదీనుంచి దర్శనాలను పునరుద్ధరించారు. మొదట ఆరువేల మందినే అనుమతిస్తామని చెప్పి తర్వాత 12వేలకు పెంచారు. లాక్ డౌన్ తర్వాత వచ్చిన మార్పులేమిటంటే, రాష్ట్రంలో కరోనా కేసులు బాగాపెరగటం, అందులో బాగంగా చిత్తూరు జిల్లాలో మరీ విపరీతంగా పెరగడం.
జూన్ పదకొండు నుంచి ఇప్పటిదాకా ఒక్క టిటిడి ఉద్యోగుల్లోనే 91 మందికి కరోనా సోకింది.దీనితోనే తిరుమలని కలెక్టర్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారని, అయితే, ఇలా ప్రకటిస్తే తిరుమల ఆలయాన్ని మూసేసి దర్శనాలు రద్దు చేయాల్సి వస్తుంది.టిటిడి రాబడి పడిపోతుంది. ఉపాధి కోల్పోయే పేదవాడిలాగా టిటిడి పాలకమండలి ఆందోళన చెందడం ఆశ్చర్యంగా ఉంది. రాబడి తగ్గిందని చివరకు టిటిడి ఛెయిర్మన్ కేంద్ర సాయం కూడా కోరారు.
https://trendingtelugunews.com/top-stories/breaking/corona-among-ttd-employeesno-devotee-tested-positive-eo-anil-kumar-singhal/