తెలంగాణ, కర్నాటకలను హైరిస్క్ రాష్ట్రాలుగా గుర్తించిన ఆంధ్ర

అమరావతి:తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతవతరకు ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు క్యాటగిరలో ఉండేవి.  ఇపుడు ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో ఈ రాష్ట్రాల హోదాను ఆంధ్రప్రదేశ్ పునర్వర్గీకరించింది.
ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.
ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.
విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్ లో ఉన్న వారికి 5వ రోజు, 7 రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని, 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది.
విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది.
ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఈ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు పరిచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచనలు జారీ చేసింది.
హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికల పై గట్టి నిఘా గుర్తించేందుకు ఏఎన్ఎం లు, గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

https://trendingtelugunews.com/top-stories/breaking/97-new-corona-red-zone-proposed-in-andhra-pradesh/