హైదరాబాద్ వోల్డ్ సిటిలోని అక్కన్న మాదన్న మహంకాళి గుడిలో ఈ రోజు అమ్మవారి ఘటం ప్రతిష్టించారు. ఘటాన్ని షాలిబండ కాశీ విశ్వనాథాలయం నుంచి తీసుకువచ్చారు. సాధారణంగా పూజ తర్వా వూరేగింపుగా ఘటాన్ని అక్కన్న మాదన్న గుడికి తీసుకురావడం జరగుతుంది. కరోనా వాతావరణంలో ఈ వూరేగింపునకు పోలీసులు అనుమతినీయకపోవడంతో ట్రాలీ లో ఘటాన్ని తీసుకువచ్చారని ప్యాట్రన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు.
ఘటం అక్కన్న మాదన్న గుడి కి చేరుకున్నాక గుడిలోనికి తలమీద పెట్టుకుని తీసుకువెళ్లి ప్రతిష్టించారు. జూలై 19న బోనాల పండుగరోజున గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, మరుసటి రోజు జూలై 20న ఏనుగు అంబారీ మీద ఘటాన్ని మూసి ఒడ్డున ఉన్న ఢిల్లీ దర్వాజా మహంకాళి టెంపుల్ కి తీసుకువెళ్తారు. దీనితో 11 రోజుల బోనాలు ముగుస్తాయని ఆయన చెప్పారు.