అసలు ఎప్పటికీ కరోనా వైరస్ అంతం కాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబ్ పేల్చింది. అందువల్ల ఎవరూ కరోనా ఎపుడు అంతమయ్యేది జోస్యం చెప్పకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితులు డైరెక్టర్ డాక్టర్ మైక్ రియాన్ హెచ్చరించారు. వ్యాక్సిన ను కనుగొన్నా, ఈ వైరస్ ను అదుపులోకి తెచ్చుకునేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ మైక్ రియాన్ జెనీలో వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయాలువెల్లడించారు. ముఖ్యమయిన విషయం ఏంటంటే, ఇది మానవసమాజాల్లో ఎప్పటికీ అంటుకునే ఉండే వైరస్ గా మిగిలిపోతుంది.దీనిని వదిలించుకోలేకపోవచ్చు,’ ఆయన పేర్కొన్నారు.
ఎవరైనా ఈ మహమ్మారి అంతమయ్యేది కాలం నిర్ణయించడాన్ని తాను నమ్మనని ఆయన పేర్కొన్నారు.
ఇపుడు కరోనా వైరస్ ని నివారించేందుకు 100 పొటిన్షియల్ వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ లు వచ్చినంత మాత్రాలన వైరస్ కనుమరుగైపోదు. ఈ విషయాన్ని ఇతర వైరస్ లు రుజువుచేశాయి. మీజల్స్ వంటి రోగాలకు వ్యాక్సిన్లు న్నాయి. ఆరోగాలు మాయం కాలేదుగా, అని ఆయన గుర్తు చేశారు.