అమరావతి: ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుడదని, విద్యార్థులు కు మార్కులు, రాంక్ లు ఇవ్వకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది.
ఈ ఆదేశాలను సర్వత్రా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీర భద్రుడు రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డి ఈ ఓ లు ఆదేశించారు.
ప్రత్యామ్నాయ విద్య సంవత్సర క్యాలెండర్ ను సిద్దం అవుతూ ఉందని,ఈ ప్రత్యామ్నాయ విద్య సంవత్సర క్యాలండర్ ను మాత్రమే పాటించాలి అని స్కూళ్లను ఆదేశించారు. ఇదే విధంగా ఆన్లైన్ అబ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రైవేట్ పాఠశాల ల యజమానులు ఆన్లైన్ క్లాస్ లు నిర్వహించి ఫీస్ లు చెల్లించమంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుండటంతో ప్రభుత్వం ఈ ఆదేశాాలుజారీ చేసింది.
“కొన్ని పాఠశాలలు విద్యార్థులు కు టెస్ట్ లు పెట్టి మార్కులు, రాంక్ లు ఇస్తున్నారని మా దృష్టికి వచ్చింది.రాష్ట్రం లో ఇంకా అకడమిక్ క్యాలెండర్ తయారుకాలేదు.పనిదినాలు, సిలబస్ తగ్గిపు ద్వారా విద్యార్థుల అభ్యాసం పై ప్రభావం పడకుండా జాగర్తలు తీసుకుంటున్నాము. ఎస్ సి ఈ ఆర్ టి ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను అన్ని స్థాయి విద్యర్థులకు తయారుచేయడం మొదలుపెట్టింది,” అని చినవీరభద్రుడు పేర్కొన్నారు.
టీచర్లు….సోషల్ మీడియ, టెక్నాలజీ సాయంతో అకడమిక్ విద్యను పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థులకు అందించాలని ఆయన ఆదేశించారు.