కెసిఆర్ ఆరోగ్యమెలా ఉందో వెల్లడించండి: హైకోర్టులో రిట్ పిటిషన్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టు లో మాండమస్ పిటిషన్ దాఖలయింది.   నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుండి సీఎం ఫామౌస్ కి వెళ్లిపోయినట్టు యూట్యూబ్ లో ప్రచారం జరుగుతోందని , ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం  గురించి తెలియాల్సిన అవసరం ఉందని తీన్ మార్ మల్లన్న పేర్కొన్నారు.
రెండు రోజులకిందట అదాబ్ హైదరాబాద్ పత్రికలో కెసిఆర్ కు కరోనా అని వార్త రాసినందుకు ఎడిటర్ ఆనంచిన్న వెంకటేశ్వర్రావను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేసి తర్వాత బెయిల మీద విడుదలచేసిన సంగతి తెలిసింది. ఎందుకంటే, ఇలాంటి వార్తలను ఫేక్ న్యూస్ గా పోలీసులు భావిస్తున్నారు.

https://trendingtelugunews.com/english/breaking/adaab-hyderabad-journslist-anam-chinni-arrest-for-writing-fake-news-on-kcr-and-corona/

ఇలాంటపుడు తీన్ మార్ మల్లన్న పిటిషన్ దాఖలయింది.
ముఖ్యమంత్రి గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని ప్రభుత్వం లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి అందుబాటు లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.
 గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని, తన ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏంతో కృషి చేసి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని కూడా ఆయన పేర్కొన్నారు.
కరోనాను కట్టడి చేయడం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని  అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారని,  చెబుతూ ఇపుడు  అనేక పత్రికల్లో, మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రకరకాల వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందొ తెలపాలని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.