తెలంగాణ కరోనా సంక్షోభం మీద అఖిల పక్ష సమావేశం పెట్టండి: డా.మల్లు రవి

రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్‌ఎంసిపరిధి లో ఆందోళనకంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా రాష్ట్రమంతా విజృంభిస్తూ ఉంది.రెండు రోజుల పాటు దినసరి పాజిటివ్ కేసులు  1800 కు పైగా పెరగడమనేది భయం గొలిపే విషయం. మొన్నటి మొన్నటి వరకు తెలంగాణా కొన్ని ప్రాంతాలలో కరోనా  ప్రవేశించకుండా ఉండింది.  ఇపుడు రాష్ట్రం లో కరోనా చొరబడని ప్రాంతం లేకుండా పోయింది. ఈ పరిస్థితి ప్రజలలో  తీవ్రమయిన మానసిక అలజడిని సృష్టిస్తూఉంది. పైరుకు లాక్ డౌన్ సడలించినట్లు చెబుతున్నా ప్రజల్లో ఇది ఆత్మస్థయిర్యాన్ని పెంచడానికి బదులు భయం పుట్టిస్తూ ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం ఏవిధంగా ను రాష్ట్రానికి మంచిది కాదు. భయాందోళన మధ్య ప్రజలున్నపుడు ఆర్థిక కార్యక్రమాలు కొనసాగవు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగకపోతే ఉపాధి అవకాశాలు పోతాయి. ఉపాది లేకపోతే కుటుంబాదాయాలు పడిపోయి, అర్ధిక సంక్షోభం నెలకొంటుంది. ఒక విధంగా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ  వచ్చింది.  అందువల్ల ఈ పరిస్థితిని రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు, కరోనా పానిక్ నుంచి ప్రజలకు భరోసా కల్పించేందుకు  ప్రభుత్వం  వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు తెలంగాణ  ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను.
రాష్ట్రంలో తక్ణణం కరోనాను  నియంత్రించే కార్యక్రమాన్ని  ప్రకటించాలి. ఈ విషయాన్ని చర్చిండానికి  అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వాలని సిఎం కెసిఆర్‌ను నేను కోరుతున్నాము.
టిఆర్ఎస్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్ మరియు ట్రీటింగ్ వంటి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు కళ్ల ముందు కనబడుతున్న పరిస్థితే సాక్ష్యం. ప్రపంచంమంతా లాక్ డౌన్ ప్రకటించాకా కరోనా తగ్గు ముఖం పడుతున్నది. చాలా యూరోప్ దేశాలలో కరోనా తగ్గిపోవడమే కాదు, అక్కడ స్కూళ్లు కూడా తెరుస్తున్నారు. ఆదేశాలేవీ తెలంగాణ కంటే పెద్ద దేశాలు కాదు. ధనిక దేశాలు కాదు.  మరి ఈ పరిస్థితి సంపన్న రాష్ట్రంగా, సాంకేతికంగా బాగా అభివ‌ృద్ధి చెందిన రాష్ట్రం చెప్పుకుంటున్నమనమెందుకు ఆ దేశాలలాగా విజయవంతం కాలేకపోయాం.
ఈ రాష్ట్రాన్ని కరోనా క్లిష్టకాలంలో ప్రవేశించేందుకు  కారణాలను చర్చించాల్సి వుంది.  కరోనా పర్యవసానాలు రాష్ట్రంలో ప్రజలందరి మీద పడుతున్నాయి. ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక పరిస్థితిక బాగా క్షీణిస్తూ ఉంది. ఇక ఈ విషయాన్ని  ప్రభుత్వానికి వదిలేయలేని పరిస్థితి ఎదురయింది. అందువల్ల అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలి. అన్ని పార్టీల  అభిప్రాయాలు తీసుకోవాలి.అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అన్ని పార్టీల సమన్వయంతో ముందుకు సాగాలి. ఎందుకంటే, ముఖ్యమంత్రి కనిపించడం లేదని వార్తలొస్తున్నాయ్, మంత్రుల కుటుంబసభ్యులకు కరోనా అంటున్నారు. ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ అంటున్నారు. ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లకు కోరోనా సోకిందంటున్నారు. ఎమ్మెల్యలకు కరోనా.ఈ వార్తలన్నీ వింటూంటే నిజంగానే భయమేస్తుంది.తెలంగాణ ఎటువోతున్నదనిపిస్తుంది.
అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇఖ జాప్యం చేకుండా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
కరోనా మీద ప్రభుత్వం ప్రజలకెపుడే సంపూర్ణ సమాచారం అందించలేదు. పరీక్షలు నిర్వహించాల్సిన సమయంలో నిర్వహించలేదు. పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తూ , మరొక వైపు కేసులే లేవు, కరోనా తెలంగాణ అదుపు చేసింది, ప్రభుత్వం నిరక్ష్యం చేసి ఉంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లాగానో, ముంబై లాగానో ఉండేదని కాలం వెల్ల బుచ్చి కరోనా ఇలా తీవ్రంగా విజృంభించేందుకు ప్రభుత్వమే కారణమని నేను భావిస్తున్నాను. పరీక్షలన్నీ నిలిపివేసి, ఒకటి రెండూ కనిపించిన కేసులను చూపి కరోనా ఎక్కడుందని ప్రభుత్వం పెద్దలు ప్రశ్నించిన విషయాన్ని ప్రజలెవరూ మర్చిపోలేదు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు చేయకుండా ప్రమాదకరమయిన పరిస్థితులను సృష్టిస్తూ ఉందని కేంద్రం కూాడా అవాక్కయిన సంగతి తెలంగాణ ప్రజలకేకాదు, దేశమంతా తెలుసు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి  ప్రీతిసూడాన్ తెలంగాణ ప్రభుత్వం ధోరణి మీద అసంతృప్తి వెల్లగక్కిన విషయం అందరికి తెలుసు.జాతీయ పత్రికలన్నఈ విషయాన్ని తీవ్రంగా హైలైట్ తెలంగాణ ప్రభుత్వం వింతపోకడని బయటపెట్టాయి.
కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున జరపకపోతే, కొంపలంటుకుంటాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించేసరికి దినసరి కేసులు 2000 కు చేరుకునే పరిస్థితి దాపురించింది.దేశంలోనే అతి తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చింది.
ఈ పరిస్థితి ఎదురవడానికి ప్రభుత్వం ఉదాసీనతే కారణమని నేను భావిస్తున్నాను. దీనికి పూర్తి  బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. ఇక ఈ పరిస్థితి కొనసాగరాదు. అందువల్ల బేషజానికి పోకుండా ప్రభుత్వం వెంటన అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేాయాలి.
చివరకు కరోనా నియంత్రణలో కూడా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశాలు నడిపించే పరిస్థితి రావడం చాలా విచారకరం. కరోనా కేసుల వ్యవహారంలో, కరోనా గురించి ప్రజలకు సరైన సమాచారం అందించేవిషయంలో, ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో ప్రభుత్వ ధోరణిని  హైకోర్టుకూడా తప్పుపట్టింది. పరీక్షల జరపాల వద్దా అనే విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేేకుండాపోయింది. పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, తల్లి తండ్రుల ఆందోళన ను మీకు అర్థం కాదా అని కోర్టు మొట్టిక్కాయ వేశాక గత్యంతరం లేక పరీక్షలు వాయిదావేశారు. ఇది పరిపాలనా వైఫల్యం కాదా? రాష్ట్రానికంతా ఒకే ఆసుప్రతికిన కోవిడ్ ఆసుపత్రి గా ప్రకటించి డాక్టర్ల మీద విపరీతంగా పని వత్తిడి పెంచి వారంతా కరోనా బారినపడేందుకు ప్రభుత్వం దగ్గిర సరైన కరోనా యాక్షన్ ఫ్లాన్ లేకపోవడమే కారణమని డాక్టర్ గా నేను భావిస్తున్నాను.
ఇన్ని వైఫల్యాలు ఎదురవుతుంటే కరోనాటాస్క్ ఫోర్స్ ఏంచేస్తున్నదో అర్థం కాదు.
పరీక్షా కేంద్రాలను డిమాండ్‌కు సరిపడే విదంగా పెంచాలని కోర్టు చెప్పాల్సి రావడం ఒక దుర్గతి. కరోనా పరీక్షల సంఖ్య రెట్టింపు చేయాలి. తీవ్రత లేని వారికి ఇంట్లోనే చికిత్స చేయాలి. తీవ్రమైన కేసులను మాత్రమే ఆసుపత్రులలో చేర్చాలి. గాంధీ ఆసుపత్రిలోచికిత్సను ప్రజలలో విశ్వాసం కలిగేలా మెరుగుపర్చాలి. విఐపిలకు ప్రయివేటు ఆసుపత్రులు, పేదలకు గాంధీ ఆసుపత్రియా అనే విమర్శ వినపడూతుంది. ఎంత పెద్ద వాడైనా సరే , కోటీశ్వరుడైనా సరే గాంధీలోనే చికిత్స అని అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన చారిత్రక ప్రకటన ఏమయింది? రోగులను ఆసుపత్రులలో చేర్చుకోవడం వారికి  చికిత్స అందించడం మీద  ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు నిర్దిష్ట గైడ్ లైన్లు ఎపుడో జారీ చేసి ఉండాలి. అదిప్పటికీ జరగలేదు. ప్రయివేటు ఆసుపత్రులలో లక్షలకులక్షల బిల్లులొస్తున్నాయని వీటిని భరించడం కష్టంగా ఉందని ప్రజలంటున్నారు.కరోనా కేసుల అత్యవసరమయినపుడు  పరీక్ష మరియు చికిత్స ఖర్చును ప్రభుత్వం భరించాలి. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చలి.
కరోనా వ్యాప్తిలో వైన్ షాపుల టైమింగ్స్  పాత్ర ఉందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటపుడు వైన్ షాపేదో అత్యవసరమయినట్లు  ప్రభుత్వం  వైన్ షాపుల టైమింగ్స్ పెంచడం హాస్యాస్పదమనిపిస్తుంది. అందువల్ల    సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం వైన్ షాపులు మూసివేయాలి.
ఈ వైఫల్యాలను చర్చించి ప్రజలకు భరోసా కల్పించేందుకు అఖిల పక్ష సమావేశం అవసరమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించకపోతే ప్రజా ఆందోళనను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది.
(డాక్టర్ మల్లు రవి, మాజీ  లోక్ సభ సభ్యుడ,టిపిసిసి ఉపాధ్యక్షుడు)