కరోనా వ్యాక్సిన్ ఎపుడొస్తుందా అని ప్రపంచం ఎదురుచూస్తూ ఉంది. అందుకే కరోనా వ్యాక్సినో, మందో మాకో తొందరగా రాగపోతుందా అని ఆత్రుత జనమందరిలో కనిపిస్తుంది. అందుకే వ్యాక్సిన్ న్యూస్ ఏదొచ్చినా ప్రజలు చి ఎగబడి చదువుతున్నారు. మొన్నా మధ్య చివరకు పతంజలి కరోనిల్ అని ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక మందు పేరు ప్రకటించగానే అంతా ఎగిరి గంతేశారు. కారణం, జనంలో ఈ మాస్కు పెట్టుకుని, శానిటైజర్లువాడుతూ, బయటకు తిరగకుండా , మాల్స్ వెళ్లకుందా,బార్లకు, రెస్టరంట్లకు పోకుండా ఇంటికే పరిమితమయిన జీవితం…ఎంతనరకమో అంతా అనుభిస్తున్నారు. అందుకే ఏదో ఒక వ్యాక్సినో , మందో మాకో వస్తే, గుటుక్కున మింగేసి మళ్లీ పాతరోజులు వచ్చాయి… అని పాడుకుంటూ రోడ్లమీద తిరగాలనుకుంటున్నారు. ఇలాంటపుడు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి కరోనా వ్యాక్సిన్ కబురందింది.
ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌పై సక్సెస్‌ఫుల్‌గా ట్రయిల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోపిక్ కంపెనీ ఈ పనిని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 స్వాంతత్య్ర దినోత్సవం నాటికి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరుగులు పెడుతూ ఉంది.
ఐసీఎంఆర్ సైతం కరోనా వ్యాక్సిన్ తయారీకి ముందు జరిగే ప్రక్రియలను వేగవంతం చేస్తున్నది. ఇది మొట్టమొదటి దేశీయ వ్యాక్సిన్ అవుతుందని, అందువల్ల దీనిని తొందరగా తయారుచేేసి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రిక్లినికల్ క్లినికల్ ట్రయల్స్ లో ఐసిఎంఆర్ భాగస్వామి అవుతుందని ఈ సంస్థ ప్రకటిచింది.
This is the first indigenous vaccine being developed by India and is one of the top Priority projects which is being monitored at the topmost level of the Government. The vaccine is derived from a strain of SARS-CoV-z isolated by ICMR-National Institute of Virology, Pune. ICMR and BBIL are jointly working for the preclinical as well as clinical development of this vaccine.