చైనా యాప్స్ ని ఇతర ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వస్తున్నది. సోషల్ మీడియా ఈ డిమాండ్ తో ఠారెత్తి పోతున్నది. మొత్తానికి చైనా కంపెనీలు తయారు చేసిన 59 యాప్ లను ఇండియా నిషేధించాలనినిర్ణయించింది. ఇందులో టిక్ టాక్, హెలో యుసి బ్రౌజర్ తదితర యాప్ లు న్నాయి. వీటన్నింటిలో టిక్ టాక్ ఇండియాల్ చాలా పాపులర్ అయింది. టిక్ టాక్ మీద నిషేధం విధించాలన్న డిమాండ్ హోరెత్తడంకనీసం రెండేళ్లుగా నడుస్తూ ఉంది. ఇది భారత ప్రభుత్వానికి తెలుసు. చైనా యాప్ లమీద ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నా, భారత ప్రభుత్వం సరిగ్గా మూడు వారాల కిందట సొంతంగా టిక్ టాక్ అకౌంట్ వోపెన్ చేయడమే ఆశ్చర్యం. నిజానికి ఇపుడు బ్యాన్ విధించినా, దానికి రంగం ప్రిపేర్ కావాలంటే రకరకాల శాఖ లనుంచి నివేదికలందాలి. అందుతూ ఉండాలి. దీనికి రెండుమూడు నెలల ఎక్సర్ సైజ్ అవసరం. నిర్ణయం ఇండో-చైనా ఉద్రిక్తతల మ ధ్య తీసుకున్నా, ఈ యాప్ లో వచ్చై దేశ సెక్యురిటీ సమస్య గురించి ప్రభుత్వంలో అవగాహన ఉండాలికదా. అయినా సరే, భారత ప్రభుత్వం జూన్ ఎనిమిదో తేదీన టిక్ టాక్ అకౌంట్ (@mygovindia) ఒపెన్ చేసింది. ఈ అకౌంట్ కి 949.6వేల మంది పాలోవర్స్ ఉన్నారు. 6.9 మిలియన్ లైక్ లు వచ్చాయి. ఈ అకౌంట్ అఫిషియల్ ఫ్రొఫైల్ స్టేట్ మెంట్ ఏమిటో తెలుసా? “Citizen Engagement platform of Government of India.” 1.3 బిలియన్ జనాభా ఉన్న భారతదేశంలో యువకులంతా ఎగబడి డౌన్ లోడ్ చేసుకున్న యాప్ టిక్ టాక్. అందువల్ల భారతీయ భావజాలాన్ని, దేశభక్తిని, హిందూమత ప్రాముఖ్యాన్ని, యోగను ఈ యువకుల్లో తీసుకుపోయేందుకు వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని భారత ప్రభుత్వం భావించింది. అందువల్ల కేవలం మూడు వారాల కిందట టిక్ టాక్ యాప్ భారత ప్రభుత్వానికి ఒక ప్రచారసాధనమనే కేంద్రం భావించింది. ఆశ్చర్యంగా ఉందికదూ?
టిక్ టాక్ ప్లాట్ ఫామ్ అఫిషియల్ వెబ్ సైట్ లో ఏమిరాశారంటే…
“The @mygovindia platform is a unique participatory governance initiative involving the common citizen at large. The Idea of MyGov brings the government closer to the common man by the use of online platform creating an interface for health exchange of ideas and views involving the common citizen and experts with the ultimate goal to contribute to the social and economic transformation of India.” (Source:The Times of India)
ఈ రోజు ఈ అకౌంట్ మాయమయింది. ఒకవైపు ఆత్మనిర్భర్ అని చెబుతూ, మరొకవైపు చైనా యాప్ లకు వ్యతిరేకంగా సోషల్ మీడియా సైబర్ ఆందోళన సాగుతున్నా భారత ప్రభుత్వ చైనా యాప్ ను వినియోగించుకోవాలనుకోవడం బాగా విమర్శలకు దారితీసింది.
Amidst #BanTikToklnlndia, Govt. Of India officially joins #TikTok.
Within few hours the account has almost 1 Million followers & 6m5 Million Likes.#BoycottChineseApp #IndiaChinaFaceOff #ModiSpeakUpOnChina #MyGovIndia pic.twitter.com/p1ljcv1NRL— Aadeep Singh (@AadeepSingh) June 7, 2020
Expectation:
Indians ask Government to ban TikTok!Reality:
Government of India makes account on Tiktok! pic.twitter.com/LmYjKKQVYN— Sabyasachi Biswas (@Sabyasaachii) June 6, 2020
That frustrating moment when u trend #BoycottChineseProduct all day N later get to know #mygovindia is on Chinese App #Tiktok🙆
The same chineseApp dat so many ppl want to uninstall@narendramodi @PMOIndia @TikTok_IN
See for yourselfhttps://t.co/K3b9En6sOZ pic.twitter.com/4q2lIjpX62— कल्पना🇮🇳💓 (@dark_hE_art) June 7, 2020