తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు జూలై 1 నుంచి 4వతేదీ వరకు నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో భాగంగా 1వ తేదీ బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 – 30 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. 2వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కలశ పూజ , హోమం, పవిత్ర ప్రతిష్ట చేస్తారు. 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు యాగశాల పూజ, హోమం జరుగుతాయి. 4వ తేదీ శనివారం ఉదయం 6 -30 గంటల నుంచి మధ్యాహ్నం 12 – 30 గంటల వరకు మహాపూర్ణాహుతి,యాగశాల పూజ, హోమం, పూర్ణాహుతి, కలశం ఉద్వాసన, అభిషేకం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 -30 గంటల నుంచి శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వార్లను ఆలయం లోనే ఊరేగిస్తారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పవిత్రోత్సవాల కార్యక్రమాలు, ఊరేగింపు అన్నీ ఆలయంలోనే నిర్వహిస్తారు.