ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో కరోనా వల్ల పదకొండు మంది మృతిచెందారు.కొత్తగా మరొక 796 కేసులు నమోదయ్యాయి. దీనితో శనివారం నాటికొ మొత్తం కరోనా కేసుల సంఖ్య 12285 కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 6648 కాగా కరోనాకు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారు 5840 మంది. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ విడుదలచేసిన బులెటీన్ ప్రకారం రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వల్ల మృతిచెందినవారి సంఖ్య 157కు పెరిగింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 8,16,082 శాంపిల్స్ ను పరీక్షించారు. నిన్న 263 మంది కోలుకున్నారు. ఇక మృతులకు సంబంధించి కర్నులు,కృష్ణా జిల్లాల నుంచి నలుగురేసి,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం ల నుంచి ఒక్కొక్కరు చనిపోయారు.
దేశంలో 384 మరణాలు
ఆల్ ఇండియా కేసులకు సంబంధించి భారతదేశంలో కేసులు చాలా స్పీడుగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజు 18,552 కొత్తకేసులకనిపిస్తే, మొత్తం మృతుల సంఖ్య 15,685 కు చేరింది. ఆరు రోజుల్లో ఇండియా కేసులు నాలుగు లక్షల నుంచి 5,08,953కు చేరాయి. గత ఇరవై నాలుగు గంటలలోదేశంతో కరోనా వల్ల మృతిచెందిన వారు 384 మంది. ఇపుడు దేశంలో 1,97,387 యాక్టివ్ కేసులున్నాయి. జబ్బునుంచికోలుకున్నవారి సంఖ్య 2,95,880 మంది. రికవరీ అయిన వారు 58.13 మంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.