రామోజీ ఫిల్మ్ సిటిని హట్ స్టార్ డిస్నీ మూడేళ్ల పాటు అద్దెకు తీసుకుంది. కరోన లాక్ డౌన్ వల్ల ప్రజలెవరూ ఇళ్ల నుంచి పోలేకపోవడంతో అంతా ఆన్ లైన్ సినిమా లకు అలవాటుపడిపోయారు. దీనితో ప్రజలంతా వినోదం కోసం OTT ప్లాట్ ఫార్మ్ మీద మళ్లడంతో వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ OTT ‘ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ డిస్నీ అద్దెకు తీసుకుందని రిపబ్లిక్ వరల్డ్ రాసింది.
రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా షూటింగ్ ల అడ్డా. ఇలాంటి ఫిల్మ్ సిటీ హాట్ స్టార్ డిస్నీ అదుపులోకి పోవడమంటే ఇక ఇతర సినిమా యూనిట్లకు అది అందుబాటులోలేకుండా పోతుంది. అంటే ఇతర సినిమా కంపెనీలెవరూ ముఖ్యంగా సౌత్ ఇండియా కంపెనీలేవీ పక్కనే హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నఈ వసతిని కోల్పోతాయి. స్టార్, హాట్ స్టార్ లను డిస్నీ 2019లో కొనుగోలు చేసింది. దీనితో హట్ స్టార్ అనేది భారతదేశంలో అతిపెద్ద OTT సంస్థ అయిపోయింది. తెలుగు సినిమా రంగానికి పెద్ద దెబ్బ.