కరోనా వైరస్ గురించి సెన్సేషనల్ సంగతులు బయటపడుతున్నాయి. ఇదంత అమాయకపు వైరస్ కాదు. దాని ప్రవర్త నను శాస్త్రవేత్తలు గమనించి, షాకింగ్ విషయాలుకనుక్కుని అవాక్కవుతున్నారు. ఇపుడు తాజాాగా రెండు కొ త్త విషయాలను కనిపెట్టారు. కరోనా ఒక కణం నుంచి మరొక కణానికి వెళ్లేందుకు ఏకంగా హైవేలను నిర్మించుకుంటూ ఉందనేది ఒకటయితే, రెండోది ఇమ్యూన్ వ్యవస్థని కూడా ధ్వంసం చేస్తుందనేది.
కరోన వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించాక ఏంచేస్తుం ది, మనిషిలోని ఒక కణం నుంచి మ రొక కణం లోకి ఎలా దూరి కొత్త కణాలను ఎలా ఇన్ పెక్ట్ చేస్తుందనేది ఇప్పటికి శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు.
శరీరంలో ఒక కణంనుంచి మరొక కణంలోకి వెళ్లేందుకు కరోనావైరస్ గొట్టాలతో రాజమార్గాలను నిర్మించుకుంటూ ఉన్నట్లు అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు,యూనివర్శిటీ ఆఫ్ ఫ్రైబర్గ్ శాస్త్రవేత్తలు గమనించారు.
ఇంతవరకు ఇది కూడా ఇతర వైరస్ లాగే పునరుత్పత్తి ప్రారంభించి తమ సంఖ్య పెంచుకుంటుందని, అపుడు కుప్పలుకుప్పలుగా పెరుగుతున్న వైరస్ లకు సెల్ ఇరుకయిపోయి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి ఇతర కణాల మీద దాడిచేస్తాయని అనుకున్నారు.
దీనికొక ధియరీ కూడా కనిపెట్టారు. వైరస్ ఒక కణం మీద పడగానే, వైరస్ పొర,కణం పొర కలసి పోయి ఒకటవుతాయని దీనికి ప్యూరిన్ అనే ఎంజైమ్ సాయపడుతుందని అనుకున్నారు. అంటే ప్యూరిన్అనేది వైరస్ మన శరీర కణంలోనికి ప్రవేశించేందుకు కణం పొరను చీల్చి(cleave) స్వాగతం పలుకుతుందని అనుకున్నారు.
అయితే, ఇపుడు శాస్త్రవేత్తలు కరోనా ఇన్ ఫెక్షన్ సోకిన కణాలను జాగ్రత్తగా పరిశీలించి వైరస్ ఒక కణం నుంచి మరొక కణం వెళ్లేందుకు గొట్టం లాంటి మార్గాలు సహకరిస్తున్నాయని కనుగొన్నారు. కరోనా కణాలను అదుపులోకి తీసుకుని వాటికి గొట్టాల వంటి పాదాలు పుట్టేలాచేస్తున్నది. ఈ గొట్టాలు పక్కనున్న కణాల దాకా సాగి వాటికి కన్నం వేసి వైరస్ హ్యాపీగా దూరేదుకు రాజమార్గం వేస్తున్నాయి.
అంటే కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ సోకిన మనిషి శరీరం కణానికి చట్టూ పొడవాటి గొట్టాలు పుడతాయి. ఇవి పక్కన ఆరోగ్యంగా ఉన్నకణాల్లోకి చొచ్చకుని పోతాయి. ఈ గొట్టాల్లోంచి కరోనావైరస్ ఎలాంటి అడ్డంకి లేకుండా మరొక కణంలోకి… అక్కడి నుంచి మరొక కణం లోకి… అక్కడి నుంచి ఇంకొక కణంలోకి ప్రయాణిస్తాయని వారు చెబుతున్నారు.
ఇలా ట్యూబ్ వే (tube way) లను ఏర్పాటుచేసుకుని ఒక వైరస్ ప్రయాణం చేయడమనేది ఎపుడూ చూడ లేదని వారు చెబుతున్నారు. ఈ గొట్టాలు కూడా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. వాటిని ఫైలోపోడియా (filopodia) అంటారు.
ఈ పరిశోధనను ప్రఖ్యాత జీవశాస్త్ర జర్నల్ సెల్ (Cell)లో ప్రచురించారు.
“There are long strings that poke holes in other cells and the virus passes through the tubes from cell to cell” అని నేవన్ క్రోగన్ (Naven Crogan) అనే శాస్త్రవేత్త చెప్పినట్లు Los Angeles Times రాసింది. ఈ పరిశోధన చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి క్రోగన్ నాయకుడు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, క్వాంటిటేటివ్ బయోసైన్సెస్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ కూడా.
ఈ ట్యూబ్ వే ద్వారా ప్రయాణించడం వల్ల ఇన్ పెక్షన్ చాలా వేగంగా పాకుతుందని తాము భావిస్తున్నామని క్రోగన్ తెలిపారు.
ఇలా ఒక వైరస్ ఇన్ పెక్షన్ అంటుకున్నపుడు మనిషి శరీర కనానికి గొట్టాల వంటిపాదాలు పుట్టడమనేది చాలా అసాధారణమని, ఇలా ఏ వైరస్ చేయడం లేదని వారు చెబుతున్నారు.
స్మాల్ పాక్స్ వంటి వైరస్ లు కణాలలో ఇలా బుడిపెలు పుట్టించినా అవిశాఖోపశాఖలు విస్తరించడమనేది జరగదు, ఆబుడిపెలకు, ఈ ఫిలోపోడియాలకు చాలా తేడా ఉందని వారు చెబుతున్నారు. అంటే శరీరంలో ప్రవేశించాక తొందరగా వ్యాపించేందుకు కరోనా వైరస్ తనదైన కొత్త మార్గాలను ఇలా కనుక్కుంటున్నట్లు అర్థమవుతుందని క్రోగన్ అన్నారు.
“It’s just so sinister that the virus uses other mechanisms to infect other cells before it kills the cell,”అని క్రోగన్ చెబుతున్నారు.
ఇంతవరకు కరోనా వైరస్ శ్వాసకోశ సంబంధ రోగం తీసుకువచ్చి మనిషికి ప్రాణపాయం కలిగిస్తుందని అనుకుంటున్నారు.
అయితే, ఇపుడు తాజాగా కనిపించిన ఆధారాల ప్రకారం హెచ్ ఐవి వైరస్ లాగా ఇది కూడా మనిషి ఇమ్యూనిటీని దెబ్బతీస్తూ ఉందని వెల్లడయింది.
ఈ విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి చెందిన ఇమ్యూనాలజిస్టు డాక్టర్ జాన్ వెర్రీ ఈ విషయాన్ని కనిపెట్టారు. ఆయన కోవిడ్-19 రోగుల్లో రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుందనే విషయాన్ని పరీశీలిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన కరోనా వైరస్ ఇమ్యూన్ సిస్టాన్ని కూడా ధ్వంసం చేస్తుండాటన్ని ఆయన గమనించారు. కోవిడ్ రోగుల్లో మన రోగనిరోధక శక్తిలో కీలకపాత్రవహించే T Cells , B Cells నిర్వీర్యమయినఉండటాన్ని చూశారు.
ఆయన పరిశీలించిన 71 మంది కోవిడ్ -19 రోగులలో 30 మందిలో టి సెల్స్, బి సెల్స్ పనిచేయకపోవడం కనిపించింది. ఈ పరిశోధనా పత్రాలను జర్నల్స్ లో ఇంకా ప్రచురించాల్సి వుంది. ఇలా టి సెల్స్ తగ్గిపోయి ఉండటాన్ని చైనా శాస్త్రవేత్తలు కూడ గమనించారని డాక్టర్ వెర్రీ చెప్పారు.