ఆంధ్ర టెన్త్ విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు

ప్రస్తుత విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లిన విద్యార్థులకు ఈనెల 30వ తేదీ వరకు దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా వీడియో తరగతులను ప్రసారం చేయాలని రాష్రప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా వైరస్ కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో  పాఠశాలు ప్రారంభం కావడం జాప్యం జరుగుతూ ఉంది. అందువల్ల  విద్యార్థులు విద్యాబోధన నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం  దూరదర్శన్  ద్వారా పాఠాలు బోధించేందుకు ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాకిషనర్ చినవీరభద్రుడు ప్రకటించారు..
నేరుగా తరగతి గదుల్లో బోధించేందుకు అవకాశం లేనందున వీడియో పాఠాలను రోజూ రెండు గంటల పాటు ప్రసారం చేస్తారని   కమిషనర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు: 
ఉదయం 10 నుంచి 11గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు,
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గణితం, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధిస్తారు.
26న ఇంగ్లీషు, నేచురల్ సైన్సు, 27న తెలుగు, సోషల్ స్టడీస్,
28న హిందీ, గణితం, 29న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు, 30న తెలుగు, నేచురల్ సైన్సు పాఠాలు బోధిస్తారని, ఈ అవకాశాన్ని పదోతరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.