రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డి ప్రభుత్వానికి అనూహ్యమయిన వైపు నుంచి దాడి ఎదురయింది. రాజమండ్రి మాజీ లోక్ సభ్యుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు ప్రభుత్వం తీరు మీద పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.. మరీ ముఖ్యంగా బాగా సున్నితమయిన పాయింట్ తో దాడి చేసి వైసిపిని ఇరుకున బెట్టారు. అంతేకాదు, ‘మీరు ఎక్కవ మాట్లాడ వద్దు’ అని ఆయన జగన్ కు హితవు చెప్పారు. ‘మీరు ఎక్కువ మాట్లాడవద్దు, నలుగురితో మాట్లాడటం నేర్చుకోండి, రాజశేఖర్ రెడ్డి ఇలా చేసే వారు,’ అని ఉండవల్లి కొంచెంకటువుగానే చెప్పారు.
జగన్ ప్రభుత్వం తెలుగుదేశం ఏజంట్ అని బ్రాండ్ వేసి తరిమేయాలనుకుంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆయన వెనకేసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఎన్నికల ను వాయిదా వేయడం తప్పే అని చెబుతూ జగన్ ప్రభుత్వం చేసిన తప్పులతో అది మైనర్ అయిందని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుధోరణితో ఉందని కూడా ఆయన విమర్శించారు.
‘అంతా ఎల్ వి సుబ్రమణ్యాలని అనుకోవద్దు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లున్నారు, ఎబి వెంకటేశ్వరరావులున్నారు, వాళ్ల వెనక మద్దతు ఉంది. వ్యవస్థలతో గొడవపెట్టుకోవద్దు,’ అని జగన్ కు హితవు చెప్పారు.
అంతేకాదు, కరోనా వ్యాప్తినివారించడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విపలమయిందని వ్యాఖ్యానించారు. ‘‘జగనన్న.. జగనన్న అంటూ మొదలుపెట్టిన పథకాలన్ని అమలుచేయాలంటే 80506 కోట్లరుపాయలు కావాలి. ప్రభుత్వం ఖర్చుుకు ఇది అదనం. ఇప్పటికే రెవిన్యూలాస్ భారీగా చూపిస్తున్నారు. కేంద్రం దగ్గిరా మీకు ఇచ్చేందుకు నిధుల్లేవు. మీరెలా ఈ జగనన్న పథకాలు ఎలా అమలుచేస్తారు. కాంగ్రెస్ పాలనలో ఎపుడూ రెవిన్యూ లోటు ఉండకుండాజాగ్రత్త పడ్డారు. ఈ విధానం ప్రాంతీయ పార్టీలు వచ్చాకే ఎదురవుతూ ఉంది,’ అని ఆయన అన్నారు. నవరత్నాల కోసం ప్రకటించిన ఈ నిధులు ఎలా సేకరిస్తారో చెప్పాలి. మీరే మో మాట తప్పను, మడమ తిప్పనంటున్నమీరు మరి ఈ నిధులను ఎలా సేకరిస్తారు అని వుండవల్లి అన్నారు.
అధికారంలోకి వచ్చిందని ప్రజలకు పరిపాలన చూపడానికి గాని, ప్రత్యర్థుల మీదా దాడులు చేయడానికి కాదని విమర్శీంచారు. దీనితో తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శకు బలంచేకూరింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ గురించి మాట్లాడుతూముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ ధరించకపోవవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కి చెప్పే మాట ఏంటంటే, ఆయన మాస్క్ వేసుకోరు. ఇలాంటి వీడియో ఎపుడూ చూల్లేదు. జగన్ ఇన్న స్థలం శానిటేషన్ చేస్తారని భావించినా, ఆ ఏమరపాటు పనికిరాదని అన్నారు. ఆయనను పబ్లిక్ చూసున్నారు కాబట్టి ఆయన కూడా మాస్క్ ధరించాలి. దీనితో ప్రజలు మాస్క్ ను లెక్క చేయని పరిస్థితి వస్తుంది. ఇదే నేను చూస్తున్నాను. చివరకు ఫైన్ వేస్తున్నా ప్రజలు మాస్క్ ధరించడం లేదని నేను స్వయంగా చూస్తున్న , అని ఆయన అన్నారు. శ్రేష్టుడు చేసే పనులను ప్రజలు అనుకరిస్తారు. మహాత్మాగాంధీ గోచి కట్టుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నపుడు వేలాదితాముకూడా గావంచకట్టుకుని తమ విధేయత చాటుకున్నారు. కోట్లాదిఆస్తులను పేదలక పంచారు. ఇపుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి వైపు అంతా చూస్తుంటారు. అలాంటపుడు ఆయనే మాస్క్ వేసుకోకపోతే ఏమవుతుంది ప్రజలేమని భావిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇదే విధంగా ఆయన ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన పేదలందరికి ఇళ్లు పథకం అమలు జరుగుతున్న తీరు పట్ల పెదవివిరిచారు. ఏదో నెంబర్ కోసమో, గినీస్ లోకి ఎక్కేందుకు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు, ఇస్తున్న స్థలాలు ప్రజలు బతికేందుకు పనికిరావని అన్నారు. ఈ పథకానికి భూసేకరణ పేరుతో విపరీతంగా ధరలు చెల్లించి భూములు కొంటున్నారని, నిరుపయోగమయిన భూములిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్ర లిక్కర్లో అంతా అవినీతే
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతూ లిక్కర్ మాత్రం భయంకరమయిన వాస్తవాలు బయటకు వస్తున్నాయని ఆయనవ్యాఖ్యానించారు. ఇరుగురపొరుగు రాష్ట్రాలలో చీఫ్ లిక్కర్ ధరలతో పోలిస్తే ఇక్కడ చాలా ధర అని, ఇందులో విపరీతంగా అవినీతి జరుగుతూ ఉందని, అందుకే ఇరుగుపొరుగు రాష్ట్రాలకంటే ఇక్కడ చీప్ లిక్కర్ ధర ‘కాస్ట్లీ లిక్కర్’ అయిందని ఆయన అన్నారు. ధరలు పెంచినందున రాష్టరంలో కొనుగోలు తగ్గిందని జగన్ చెప్పడాన్ని ఆయన హేళన చేశారు. చుట్టూర రాష్ట్రాలనుంచి చక్కగా ఆంధ్రవాళ్లు కొని తాగుతున్నారని ఆయన అన్నారు.
రేట్లు పెంచితే మద్యం వినియోగం తగ్గుతుందన్నవాదనను ఆయన ఖండించారు. అలాజరగడం లేదని ఆయన చెప్పారు. చీప్ లిక్కరే ఎందుకు విక్రయిస్తున్నారు? పెద్ద బ్రాండ్లవాళ్లు ఎందుకు ఆంధ్రలో విక్రయించడం లేదు, దీని మీద ఆర్ టిఐ కింద దరఖాస్తు చేశానని, స్పందన కోసం చూస్తున్నానని ఆయన అన్నారు. ఆంధ్రలో దొరికే చీప్ లిక్కర్ బ్రాండ్లు ఇక్కడ తప్ప ప్రపంచంలో మరొక చోట కనిపించవని, ఇలాంటి బ్రాండ్లు ఎలాఅమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
ఇన్ని హామీలు ఎలా అమలుచేస్తారు?
‘‘అధికారలోకి వచ్చింది తనని ఇబ్బందులు పెట్టిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని నెల్సన్ మండేలా ప్రభుత్వం ఏర్పాటు చేశాక రుజువు చేసిచూపించారు. తనను హింసించిన తెల్లవాళ్లను ఆయన క్షమించాడు. దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ల, నల్లవాళ్ల మధ్య సహజీవనానికి బాటవేశారు. అపుడపుడు నెల్సన్ మండేలా తనకు ఆదర్శమని చెప్పే జగన్ ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారా? మీరేం ఇక్కడేం చేస్తున్నారు. ఈ మధ్య నిధులకొరత ఉన్నపుడు ప్రభుత్వం ఇచ్చే హామీలను అమలుచేయడమెలా అని ఈ మధ్యఆర్థిక మంత్రి బుగ్గన ముఖ్యమంత్రి స్వయంగా అడిగారట. అపుడు ముఖ్యమంత్రి నెల్సన్ మండేలాను ఆదర్శంగాతీసుకునిముందుకు సాగండి, అపుడు నిధులవే వస్తాయని అన్నారట. ఈ విషయాన్ని బుగ్గున స్వయంగా సభలో చెప్పారు. జగన్ మండేలా ఆదర్శంతో రాజకీయాలను నడపాలని గుర్తు చేశారు.
జగన్ కు ఒకటే చెబుతాను, మీరు అధికారరంలో కి వచ్చింది ప్రత్యర్థులు అణచేసేంందుకు కాదు, వోటేసినవాళ్లకు మీరే కనిపించాలిగాని,మీరు ప్రత్యర్థులను చూపిస్తున్నారు.’’ అని ఆయన ఉండవల్లి అన్నారు.
న్యాయమూర్తుల మీద ఆ వ్యాఖ్యాలేమిటి? నిమ్మగడ్డమీద అంతప్రతీకరామేమిటి?
‘‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిందేమిటి? ఆయన ఇపుడున్న పరిస్థితుల వల్ల ఎన్నికలు పోస్టు చేశారు. దీని మీద ముఖ్యమంత్రి స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయవచ్చా? ఎన్నికల కమిషన్ చేసేదేంతా కలెక్టర్లకు, ఎస్ పిలకు ఆదేశాలీయడమే కదా. జగన్ కు ఎందుకంత అభద్రతా భావం? చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిందంతా రుజువయింది. ఇలాగే న్యాయమూర్తలు మీద చేస్తున్న కామెంట్లు ఏమిటి, జడ్జిలను ముక్కముక్కలుగా నరికేయండి, కరోనారోగులున్న వార్డులలోకి తోసేయాలని… ఇలా కామెంట్లు పెట్టడం పట్ల అరుణ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లని కాపాడతానని వైసిపి నేత ఒకరు ప్రకటించడమేమిటి, ’’ అని ఆయన ప్రశ్నించారు.