ఒడిషా పూరీ జగన్నాథ రథ యాత్రకు సుప్రీమ్ కోర్టు అనుమంతించిన అదే మాదిరిగా హైదరాబాద్ బోనాలకు కూడా అనుమతించాలనే డిమాండ్ పెరుగుతూ ఉంది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ స్వాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల ఉత్కంఠకు తెరదించి వారిని ఆనంద పరిచిందని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్యాట్రన్, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరముప్యాటన్ గోపిశెట్టి నిరజంన్ వ్యాఖ్యానించారు. శతాబ్దాల ఆచార పరంపరను ప్రజల ఆధ్యాత్మిక మనోభావాలను సుప్రీమ్ కోర్టు గౌరవించడము సంతోషదాయకమని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే రీతిలో బోనాల పండుగల మీద స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో బోనాలెత్తుతున్నారు. జులై 13 వ తేదీన ఏనుగు అంబారీపై జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఊరేగింపు జరుగుతుంది. జులై 19 వ తేదీన జరిగే సబ్జిమండి మహంకాళి మందిర ఊరేగింపు ఉంటుంది. జులై 20 వ తేదీన ఏనుగు అంబారీ ఫై శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిర ఘటముతో పాటు జరిగే పాతబస్తీ బోనాల ఊరేగింపు జరుగుతుంది. వీటికి ప్రభుత్వం అనుమతించడం. ఇక్కడ ప్రజలు లేకుండా ఆలయ కమిటీ సభ్యులతో పూరీ తరహాలో ఊరేగింపులను అనుమతి నిచ్చి తరతరాల సంప్రదాయాన్ని , ప్రజల విశ్వాసాలను గౌరవించాలి,’ అని నిరంజన్ పేర్కొన్నారు.
ఇదే విధంగా ఆగష్టు 20 వ తేదీన ఏనుగు అంబారీతో నిర్వహించే మొహరం ఊరేగింపుకు కూడా అనుమంతించి ప్రజల మత విశ్వాసాలను గౌరవించాలని ఆయన కోరారు.
భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి డిమాండ్
పూరీ రథయాత్ర జరిగినట్లుగానే జంటనగరాలలో బోనాలను నిర్వహించేందుకు తెలంగాణప్రభుత్వం అనుమతినీయాలని భాగ్యనగర్ బోనాల ఉత్సవసమితి కన్వీనర్ డాక్టర్ బగ్వంతరావు కోరారు. బోనాలను కోవిడ్ మార్గదర్శకసూత్రాల ప్రకారం, ఎండోమెంట్ శాఖ పర్యవేక్షణలో నిర్విహంవచ్చని, అదే విధంగా భక్తులు గుమికూడ కుండా కూడా జరపవచ్చని ఆయన కోరారు.