పార్లమెంటులో ఎదుగుతున్న తార పేర్లను ప్రకటించారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఎన్ సిపి లోక్ సభ్యురాలు సుప్రియా సూలే సూపర్ స్టార్ గా ఎంపికయ్యారు. అమెకు సంసద్ రత్న అవార్డు, సంసద్ మహారత్న అవార్డు రెండూ లభించాయి. ఇక ఆంధప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం లోక్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు యంగ్ స్టార్ లలోఒకరయ్యారు. ఆయనకు సభలో పనితీరకు సంబంధించిన ప్రత్యేక అవార్డు లభించింది.
తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం) పార్లమెంటు యువఎంపిలలో మంచి ప్రతిభ కనపరిచినందుకు ఇచ్చే అవార్డుకు ఎంపికయ్యారు.
17వ లోక్ సభ మొదటి సంవత్సరంలో ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డుకు రామ్మోహన్ నుఎంపిక చేశారు.
ఆశ్చర్యమేంటంటే రామ్మోహన్ తో పాటు ఈ ‘జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ ఎంపికయిన వారిలో వెటరన్ శశిధరూర్ ( కాంగ్రెస్, తిరువనంతపురం, కేరళ,నిశికాంత్ దూబే (బిజెపి, గొడ్డ, జార్ఖండ్), అజయ్ మిశ్రా (బిజెపి, ఖేరీ, ఉత్తర ప్రదేశ్ )లు కూడా ఉన్నారు.
ఈ అవార్డలును ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ప్రకటించింది.
ఈ ఏడాది ఏనిమిది మంది లోక్ సభ, ఇద్దరు రాజ్యసభ్యులకు ‘పౌండేషన్ ‘సంసద్ రత్న2020’ అవార్డులను ప్రకటించింది.ఈ సారి వ్యక్తిగత ఎంపిలతో పాటు బిజెపి ఎంపి పి.సి గడ్డి గౌడార్ (బాగల్ కోట్) అధ్యక్షతన ఉన్న అగ్రి కల్చర్ స్టాండింగ్ కమిటీకి కూడా సంసద్ రత్న 2020 అవార్డుకు ఎంపిక చేశారు.
సభల్లో మంచి పనితీరు కనబర్చిన సభ్యులకు 2010 నుంచి ఫ్రైమ్ పౌండేషన్ ఈ అవార్డులను అందిస్తూ ఉంది. అపుడు రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ అబ్దుల్ కలామ్ సూచన మేరకు ‘సంసద్ రత్న’ అవార్డు నెలకొల్పారు.
పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అధ్యక్షతన ఉన్న ముగ్గురు సభ్యుల కమిటీ ఈ అవార్డుల జ్యూరీగా వ్యవహరించింది. ఇందులో ఎన్ కె ప్రేమచంద్రన్, శ్రీరంగ్ అప్పా భార్నే సభ్యలు.
ఈ ఏడాది కి సంబంధించి ఎన్ సిపి ఎంపి సుప్రియా సూలే(బారామతి)కు పార్లమెంటులో డిబేట్స్ ప్రారంభించడానికి, ప్రశ్నలు వేయడానికి, ప్రయివేటు మెంటర్స్ బిల్స్ ప్రవేశపపెట్టాడానికి సంబంధించిన వోవరాల్ ఫర్ ఫామెన్స్ లో ‘సంసద్ రత్న 2020’ అవార్డును కమిటీ ప్రకటించింది.
అయితే, సుప్రియా సూలే, ఈ అవార్డుతో పాటు అన్నిరంగాలలోవిశేష కనబర్చినందుకు ఇచ్చే ‘సంసద్ మహారత్న’ అవార్డుకు కూడా ఎంపికయ్యారు.
ఆమె తోపాటు భర్తృహరి మహతాబ్ (బిజెడి,కటక్, ఒరిస్సా), శ్రీరంగ్ అప్ప బార్నే (శివసేన, మావల్, మహారాష్ట్ర) లు కూడా ‘సంసద్ మహార్నత ’ అవార్డును అందుకుంటారు.
బాగా ప్రశ్నలను వేసినందుకు సుబాష్ రామ్రావ్ భామ్రే (బిజెపి,ధూలే, మహారాష్ట్ర),మహిళలో మంచితీరు కనిపించినందుకు హీనా గవిట్ (బిజెపి, నందర్బార్, మహారాష్ట్ర), మొదటి సారి ఎంపిల క్యాటగరిలో ఆమోల్ రామ్ సింగ్ కోల్హే ( ఎన్ సిపి, షిర్పూర్, మహారాష్ట్ర)లు అవార్డు కు ఎంపికయ్యారు.