విజయవాడ: విజయవాడలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో మరొక మారు లాక్ డౌన్ విధించి ప్రజలను క్రమశిక్షణ లోకి తీసుకురావాలని నిర్ణయించారు. విజయవాడులో లాక్ డౌన్ ప్రకటిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. అయితే, ఈ సారి ప్రజలను లాక్ డౌన్ కు సమాయత్తం చేసేందుకు మూడు రోజులు గడవు ఇచ్చి లాక్ డౌన్ అమలులో చేస్తున్నారు. ఈనెల 26 వతేదీ నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. వారం రోజుల పాటు అమలులో ఉంటుంది. లాక్ డౌన్ కాలంలో మెడికల్ షాప్ లను మాత్రమే తెరిచ ఉంచుతారు. ప్రజలెవరూ వారం రోజులు పాటు బయట తిరగరాదని కూడా కలెక్టర్ చెప్పారు. అవసరమైన నిత్యావసర వస్తువులను రేపు ,ఎల్లుండి లోపు సమకూర్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కేసులు పెరుగుతున్నందున ప్రజలను దారితెచ్చేందుకు వారం కిందట కలెక్టకర్ మాస్క్ లను తప్పని సరి చేశారు.అంతేకాదు, ఫైన్ విధిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ రోజు పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి (వీడియో)
https://trendingtelugunews.com/telugu/breaking/no-mask-attracts-rs-100-fine-in-krishna-district/