పూరీ రథయాత్రకు సుప్రీంకోర్టు సానుకూలం, రేపే యాత్ర మొదలు

పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేస్తూ ఈ నెల18 వతేదీన ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు మార్పు చేసింది.
రథయాత్రను నిర్వహించే మీద ఒడిషా ప్రభుత్వం ఆలయ ట్రస్టు లు కలసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు కోర్టు చెప్పింది. రథయాత్ర రేపటి నుంచే ప్రారంభం కావలసి ఉంది. వెంటనే ప్రభుత్వం రథయాత్ర ఏర్పాట్లకు చర్యలు మొదలుపెట్టింది.

https://trendingtelugunews.com/telugu/breaking/puri-sankaracharya-swami-nischalananda-saraswati-favour-rathyatra-opposes-ban/

సుప్రీంకోర్టు ఉత్త్తర్వులు పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తో సహా అనేక మంది భక్తులను అసంతృప్తికి గురి చేసింది. దీనితో రథయాత్రను అనుమతించాలని, అనేక సంస్థలు కోర్టు లో 17  రివిజన్ పిటిషన్లు వేశాయి. ఇందులో ఒకముస్లింభక్తుడు అల్తాఫ్ హుసేన్ కూడా ఉన్నారు. గతంలో ఎపుడు17 శతాబ్దంలోయుద్ధాల కారణంగా తప్ప 12 వ శతాబ్దం నుంచి నిరవధికంగా రథయాత్ర కొనసాగుతూ వస్తున్నది. అయితే, ఈసారి కరోనా కారణంగా రథయాత్ర ప్రశ్నార్థకమయింది.ప్రపంచంలో అత్యంత పెద్ద రథయాత్ర ఇదే. సుమారు 10 లక్షల మంది
ప్రజలు రథయాత్రను సందర్శించేందుకు వస్తారు. అందువల్ల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి జనసమూహం కరోనా వ్యాప్తికి
దారితీస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బాబ్దే నేతృత్వంలోని ధర్మాసనం యాత్ర నిలిపివేసింది. ఇపుడు రథయాత్రను అనుమతించకపోతే,
మరొక 12 సంవత్సరాల దాకా రథయాత్ర నిర్వహించడం సాధ్యం కాదని, ఇది పూరీ సంప్రదాయమని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ రోజు వాదనలు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు సాగాయి. రథయాత్రను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనం గుమికూడకుండా కర్ప్యూ కూడా విధించవచ్చిన కేంద్రం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా కోర్టు కు తెలిపారు.
టెంపుల్ కమిటీతో సంప్రదింపులు జరిపి, కేంద్రాన్ని కూడా సంప్రదించి రథయాత్రను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఒదిషా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు.