పూరి జగన్నాథ రథయాత్రను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పున:పరశీలించాని సుప్రీంకోర్టు చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 23 నుంచి పూరీలో జగన్నాథ రథయాత్ర జరగాల్సి ఉంది.
కోవిడ్ నియమాలకు తు.చ తప్పకుండా పాటిస్తూ, జనం గుమి కూడటం మీద అంక్షలు విధించి రథయాత్ర జరుపుకునేందుకు అనుమతినిస్తూ గురువారం నాడు ఇచ్చిన ఉత్తర్వులను మార్పు చేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.
కోర్టులో పిటిషన్ వేసిన వారిలో ఆఫ్తాబ్ హొసేన్ (Aftab Hossen) ఒకరు. పూరిలో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించి, రథయాత్రను మాత్రం అనుమతించేందుకు ఏర్పాట్లు చేయాలని హొసేన్ కోర్టు ను కోరినట్లు న్యాయవాది ప్రనయ కుమార్ మహాపాత్ర వెల్లడించారు. ప్రజలను అనుమతించకుండా, కేవలం ఆలయ సేవకులతో మాత్రమే రథయాత్ర జరిపించండని ఆయన తన పిటిషన్ లో కోరారు.అఫ్తాబ్ నయాగడ్ జిల్లాకు చెందిన వ్యక్తి. రథయాత్రను కేవలం పూరీ కే పరిమితం చేయాలని కూడా ఆయన కోర్టును కోరారు.
జగన్నాథ రథయాత్రకోసం రథాలను తయారుచేసేందుకు, పనివాళ్ల కు కోవిడ్ -29 పరీక్షలు జరిపించేందుకు ఇప్పటికే కోట్లరుపాయల ఖర్చు చేశారని చెబుతూ జూన్ 18 న వచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఒరిస్సా ప్రజలను నిరాశపర్చాయని అఫ్తాబ్ పేర్కొన్నారు.
రథయాత్ర ప్రయోజనాల వేనక శాస్త్రీయత ఉందని చెబుతూ యాత్ర కోసం జగన్నాధుడు ఆలయం నుంచి బయటకురాగానే వాతావారణం ఆహ్లదకరంగా తయారవుతుందని కూడా అఫ్తాబ్ తన పిటిషన్ లోపేర్కొన్నారు.
ఈ పిటిషన్ సోమవారం కోర్టు పరిశీలనకు రానుంది.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సుమారు 12 లక్షల మంది భక్తులు గుమికూడే భారీ ఉత్సవాన్ని అనుమతించలేమని, అనుమతిస్తే జగన్నాధుతమను క్షమించడని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బోపన్నల ధర్మాసనం తీర్పు ఇచ్చినసంగతి తెలిసిందే. ఒరిస్సా ప్రభుత్వం కూడా రథయాత్రను ఆపుచేయాలనే వాదించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు.
Like this story? Share it with friend!