జర్నలిస్టు మనోజ్ మృతి పై గాంధీ ఆస్పత్రి నివేదిక కోరిన హెచ్చార్సీ

జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి పరిహారం:హెచ్ఆర్సీలో పిటిషన్
విధినిర్వహణలో వుంటూ కరోనా బారినపడి గాంధీ ఆసుపత్రి లొ సరైన చికిత్స అందక ప్రభుత్వ నిర్లక్షానికి మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ జర్నలిస్ట్ ఫోరం ఫర్ తెలంగాణ సభ్యులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.   గాంధీ ఆసుపత్రి లో సౌకర్యాలు లేకపోవడం, సరైన చికిత్స అందకపోవడం వల్ల ఆయన ప్రాణాపాయ స్థితిలోకి నెట్టబడ్డాడని, ఈ విషయాన్ని  మనోజ్ పదే పదే చెపుతూ చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడని జర్నలిస్టు కమిషన్ కు నివేదించారు.
వసతులు లేని గాంధీ ఆసుపత్రి  ఆయన జీవించే హక్కుని కాలరాసిందని సీనియర్ జర్నలిస్ట్ లు అమర్, సతీష్ కమల్ లు ఆవేదన వ్యక్తం చేశారు.
Majoj Kumar Yadav
మనోజ్ స్వతహాగా జర్నలిస్ట్ కావడం తొ సమాజానికి ఆసుపత్రి దుస్థితి ని వీడియోలు తీసి పంపడం తొ జాతీయ మీడియా ప్రసారం చేసి కళ్ల కు కట్టినట్టు చూయించడం జరిగిందన్నారు.

Like this story? Share it with a friend!

మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించండిఅని మనోజ్ వేడుకున్నప్పటికీపట్టించుకోకుండా మూడు పదుల నిండు యువకుడిని ప్రభుత్వ బలిగొందని వివరించారు.8 మాసాల కింద పెళ్లి చేసుకుని మరో 6 నెలల్లో తండ్రి కాబోతున్నా మనోజ్ సంతోషం ఆవిరై నిండు నూరేళ్లు నిండి పోయాయన్నారు. మనోజ్ మృతి కి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు.
మనోజ్ కుటుంబానికి నష్టం పరిహారం కింద కోటి రూపాయలు చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని మరియు నివసించడానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లుఅందించిఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పిటిషన్ కు స్పందించిన హెచ్చార్సీ ఆగస్టు 17 లోపు నివేదిక సమర్పించాలని గాంధీ సూపర్డెంట్ కు ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు.

https://trendingtelugunews.com/telugu/breaking/tv5-journalist-dies-of-covi-19/