ఎపిలో కూడా టెన్త్ పరీక్షలు రద్దు, ప్రకటించిన విద్యామంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది.రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈనిర్ణయంతీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ప్రకటించారు. పదిరోజుల కిందటేతెలంగాణ టెన్త్ పరీక్షలను రద్దు చేసిన సంగతెలిసిందే.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధప్రదేశ్ లో  జూలై 10 నుంచి 17 దాకా ఈ పరీక్షలుజరగాల్సి ఉంది. ఈ పరీక్షల కోసం ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున మొదలయ్యాయి. పరీక్ష తేదీలు ప్రకటించే నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా పరస్థితి తీవ్రంగా మారిపోయింది. కరోనా ఏమాత్రం కంట్రోల్ కాగపోగా విపరీతంగా విస్తరిస్తూ ఉంది.  మంత్రి టెన్త్ పరీక్షలు రద్దుచేస్తున్నామని ప్రకటించేటప్పటికి రాష్ట్రంతో కరోనా కేసులు అంటే రాష్ట్రం కేసులు, ఇతర  రాష్ట్రాల నుంచి , ఇతర దేశాల నుంచి వచ్చిన వారి కేసులు అన్నికలిపితే 8452 కేసులయ్యాయి. ఈ రోజు కొత్త గా  చేరిన కేసులు 491 (ఎపి 390, ఇతర రాష్ట్రాల వారు 83,ఇతర దేశాలరు 18). అనంతపురం, ప్రకాశం జిల్లాలలో లోకల్ లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటన వెలువడింది.
‘పరీక్షలను తప్పనిసరిగా పరీక్షలు జరపాలని అనుకున్నాం. పరీక్ష విధానంలో మార్పులు చేశాం. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లుగా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నాం. అనుకున్నాం. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం.6.3 లక్షల మంది విద్యార్థులకోసం ఆన్ లైన్ పాఠాలు నిర్వహించారు.  అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు చేసుకున్నాం. అయితే, ప్రస్తుతం ఉన్న పరీస్థితులును దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా శానిటైజర్లు,థర్మల్ స్కానర్లు కూడా ఏర్పాటుచేశాం. అయితే, పరిస్థితులు ప్రభావం వల్ల పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం,’ అని మంత్రి ప్రటించారు.
పరస్థితిని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నామని, కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారని  మంత్రి తెలిపారు.

పవన్ కల్యాాణ్ అభినందనలు

కరోనా విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలను రద్దు చేసినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ను అభినందించారు.