ఇక ముందు దరఖాస్తు చేసిన పది పనిదినాల్లోనే ఆంధ్రలో పెన్షన్.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్, ఇతర సంక్షేమ లబ్ది మంజూరులో నూతనాధ్యాయం ప్రారంభించింది. ఇకనుంచి దరఖాస్తు చేసిన పది పనిదినాల్లో అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేస్తారు. అంతేకాదు, పెన్షన్ దరఖాస్తు ఇష్టాను సారం తిరష్కారించడానికి వీలుండదు. అర్హత ఉన్నా పెన్షన్ మంజూరుకాకపోతే, సంబంధిత అధికారి మీద అక్షింతలు పడతాయి.
అర్హతే ప్రామాణికంగా పదిరోజుల్లో పెన్షన్ల మంజూరీ వుండాలన్న సీఎం ఆదేశాలను అధికార యంత్రాంగం ఈ రోజు ఆచరణలో పెట్టింది.
ఇపుడున్న విధానాలకు  ప్రకారం పెన్షన్ కోసం పెట్టే దరఖాస్తులను ఎపుడు పరిశీలిస్తారోతెలియదు, ఎవరికి మంజూరవుతుందో, ఎవరికాదో,ఎందుకు మంజూరవుతుందో, ఎందుకు దరఖాస్తు తిరస్కరిస్తాతో తెలిసేది కాదు. దీనికితో చదువురాని పేదలు చాలా మంది నెలలు నెలలు ఆగాల్సి వచ్చేది. దీనితో ఆఫీసుల చుట్టు తిరగాల్సివచ్చేది. ఈ నిరంకుశత్వం ఈ రోజు నుంచి ఎండ్… దరఖాస్తు చేసిన పదిరోజుల్లో తెలిపోతుంది. దరఖాస్తు రాకపోతే, కారణలు తెలుసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.దీనికి అధికారులు సహకరించాలి. లేకపోతే వారి చర్యలుంటాయి.

Like this post? Share it with a friend!

పారదర్శకతతో పదిరోజుల్లో దరఖాస్తు చేసిన వారికి మంజూరు చేసిన పెన్షన్ కార్డులను శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు అందచేసే ప్రక్రియ ప్రారంభించింది.
 దీని ప్రకారం 10 పనిదినాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులకు పెన్షన్లు, రైస్ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ళపట్టాలు మంజూరు చేయాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అలాగే ఏ కారణం తోనైనా దరఖాస్తును తిరస్కరిస్తున్నారో ఆ విషయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించాలని, అర్హత వుండి కూడా ప్రభుత్వ సేవలను అందించకపోతే అందుకు బాధ్యులైన అధికారులే జవాబుదారీగా వుంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  స్పష్టం చేశారు.

https://trendingtelugunews.com/telugu/breaking/andhra-new-covid-policy-districts-impose-local-lockdown/

ఈ ఆదేశాలను వెంటనే అమలులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 1 నుంచి 9 వ తేదీ వరకు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసిన వారికి  పది పనిదినాలకాల పరిమితి నియమం వర్తింపచేశారు. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, కొత్త పింఛన్లను మంజూరు చేశారు.
కొత్త కార్డుల పంపిణీ ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు శనివారం పెన్షన్ కార్డుల పంపణీ ప్రారంభించారు. పెన్షన్ కార్డుతో పాటు పెన్షన్ పాస్ బుక్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశం, పెన్షన్ మంజూరు ప్రోసిడింగ్స్ ను లబ్ధిదారులకు అందచేస్తున్నారు.  శనివారం ఉదయం నుంచే గ్రామ, వార్డు వాలంటీర్లు కొత్త పెన్షన్ దారులకు సంబంధించిన ఈ నాలుగు పత్రాలను నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు.
గత నెల  దరఖాస్తులు, మంజూరు వివరాలు
– గతనెల 31వ తేదీ నాటికి పెన్షన్ల కోసం మొత్తం 1,30,487 దరఖాస్తులు వచ్చాయి.
– వాటిల్లో ఎంపిడిఎ, మున్సిపల్ కమిషనర్ల ప్రాథమిక పరిశీలనలో అర్హత లేనివి: 12,548
– డిపార్ట్ మెంట్ల పరిశీలన కోసం పంపిన మిగిలిన దరఖాస్తులు : 1,17,939
– వీటిని ఆయా డిపార్ట్ మెంట్లు పరిశీలించి వాటిల్లో 1,10,104 దరఖాస్తుదారులు అర్హులుగా తేల్చాయి.
– మిగిలిన 7835 దరఖాస్తులను అనర్హత కారణంగా డిపార్ట్ మెంట్లు తిరస్కరించారు.
– మొత్తం తిరస్కరణకు గురైన దరఖాస్తులు : (12,548+7835) 20,383
– వీటితోపాటు 5524 హెల్త్ పెన్షన్లు కూడా మంజూరు.
* డిపార్ట్ మెంట్లు తిరస్కరించిన 7835 దరఖాస్తులకు నిర్ధిష్ట కారణాలు:*
– నిర్ధేశించిన ప్రమాణాలు లేని దరఖాస్తులు : 907
– శాశ్వత సదరం సర్టిఫికేట్ లేకపోవడం, తక్కువ అంగవైకల్యశాతం: 5
– వయోపరిమితి కారణాలు: 9
– పరిమితి కన్నా అధిక యూనిట్ల విద్యుత్ వినియోగం: 3972
– నాలుగు చక్రాల వాహనం కలగి వుండటం : 151
– కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి వుండటం : 333
– ఆదాయపన్ను చెల్లింపుల నిబంధన : 1485
– పరిమితికి మించిన భూమి కలిగి వున్న వారు : 973