ఆంధ్ర రౌండప్, చంద్రబాబు కు షాకిచ్చిన టిడిపి ఎమ్మెల్యే

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.తమ వాదనలు వినాలని కోరిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోరారు.బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వినాలన్నా న్యాయవాది. విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
ఏపీ టూరిజం బోట్ కంట్రోల్ రూమ్ లను ప్రారంభించిన సీఎం జగన్…

కంట్రోల్‌ రూమ్స్‌ వద్దనున్న కలెక్టర్లనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
రాష్ట్రంలో మొత్తం 9 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌
ప.గో.జిల్లా సింగనపల్లి
తూ.గో.జిల్లా గండి పోచమ్మ
ప.గో.జిల్లా పేరంటాలపల్లి
ప.గో.జిల్లా పోచవరం
తూ.గో.జిల్లా రాజమండ్రి
విశాఖ జిల్లా రుషి కొండ
గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌
కర్నూలు జిల్లా శ్రీశైలం
కృష్ణాజిల్లా విజయవాడలోని బెరం పార్క్‌
. లైసెన్సింగ్‌ విధానం పై కూడా ప్రత్యేక ఎస్‌ఓపీలను రూపొందించి ఆమేరకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ చెప్పారు. మళ్లీ అలాంటి ప్రమాదం జరగకుండా ఏంచేయాలన్నదానిపై మనం ఆలోచనలు చేసి.. ఈ కంట్రోల్‌ రూంలను తీసుకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు స్పందించి తర్వాత వదిలేయడం కాకుండా ఒక అడుగు ముందుకేసి మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామనిజగన్ చెప్పారు.
జగన్ ప్రభుత్వం బిసి లపై తీరు మారకుంటే  ఉద్యమం 
అన్ని పార్టీల్లోని బిసి ల మనోభావాలు దెబ్బతినే విధంగా  ముఖ్యమంత్రి జగన్  పరిపాలన తీరు ఉందని మంగళగిరి టిడిపి నాయకులు గంజి చిరంజీవి అన్నారు. వైకాపా ఏడాది పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ’జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పై ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు గమనించారు. అపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 500 కిలో మీటర్లు వాహనంలో తిప్పి మరల తిరిగి అపరేషన్ చేయించుకునే పరిస్దితి కల్పించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు నమోదు చేశారు.బిసిల ప్రగతే మా పార్టీ లక్ష్యం అని ఓట్లు సీట్లు సంపాదించుకున్నారు. అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు తొలగించాలి. మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఇందులో టిడిపి నాయకులు నందం అబద్దయ్య, ఆరుద్ర భూలక్ష్మీ, రేఖా సుధాకర్ గౌడ్, మున్నంగి శేషాగిరిరావు, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల రాజు తదితరులు పాల్గోన్నారు.
సారీ, రాజ్యసభ ఎన్నికల్లో వోటేయలేను, చంద్రబాబు కు ఎమ్మెల్యే లేఖ
కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నానని రేపల్లె శాసన సభ్యుడు సత్యప్రసాద్ టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడికి లేఖ రాసి షాకిచ్చారు. ఇదే లెటర్.
నేను ఇటీవల కాలంలో వ్యాపార రీత్యా తెలంగాణ రాష్ట్రం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి ని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆయనను కలిసిన నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నాను. కనుక ఈ రోజు (19)న జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కు డాక్టర్ సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారి ఈ నేపథ్యంలో ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను మన్నించగలరని ప్రార్థన. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది. పార్టీకి ఏ అవసరం వచ్చినా ముందుండే నేను ఈ విషయంలో రాలేక పోతున్నాను. కనుక నన్ను మన్నించగలరు. పార్టీకి అవసరమైనప్పుడు ఎల్లవేళలా ముందుంటానని, మీ ఆశీస్సులు, భగవంతుని దయ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ విధేయుడు
అనగాని సత్యప్రసాద్
రేపల్లె శాసనసభ్యులు.

జెసి ప్రభాకర్ అండ్ సన్ కు బెయిలు నిరాకరణ

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిలు దొరకలేదు. అశోక్ లే లాండ్ తుక్కు వాహనాలను కొన్ని కొత్త వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో వారిద్దరని పోలీసులు అరెస్టుచేశారు. తమకు బెయిల్ కావాలంటూ వారిద్దరు ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తు అనంతపురం జిల్లా కోర్టు తిరస్కరించించింది. వారిద్దరు కడప జైలులో ఉన్నారు.
మరొక మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలను పీటీ వారెంట్‌పై అనంతపురం వన్‌టౌన్ పోలీసులు కస్టడీకి కోరారు . ఈ నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది

తెలంగాణ నుంచి ఆంధ్రాకు భారీగా జోరుగా మద్యం స్మగ్లింగ్

మచిలీపట్నం: తెలంగాణ లోని ఖమ్మం జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన దివ్యభారతి, మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు ఆంధ్రకు మద్యం తరిలిస్తుండగా పట్టుబడ్డార. AP 28 AN 9717 టాటా ఇండికా కారులో 20 కేసులలో మొత్తం 1056 మద్యం బాటిల్ ఎక్కించి వాటిని నందిగామ తరలించే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసు ప్రత్యేక బృందం ఎస్ఐ మురళీకృష్ణ, సాండ్ మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట్యాలవారి గూడెం వద్ద వాహన తనిఖీలు చేస్తున్నపుడు ఈ కారు కనిపించింది. అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వాహన డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు కారును అపి తనిఖీ చేయటంతో 1,056 మద్యం బాటిళ్లు కనిపించాయి. ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిరువురిపై వత్సవాయి పోలీస్ స్టేషన్లో  ఎక్సైజ్ కేసు నమోదు చేశారు.

 ప్రధాని అఖిల పక్ష సమావేశానికి టీడీపీ  ఆహ్వానం లేనట్లే…

చైనా దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేస్తున్న అఖిల పక్ష వీడియో కాన్ఫరెన్సులు కు తెలుగుదేశం పార్టీకి ఈ మధ్యాహ్నం దాకా ఆహ్వానం అందలేదు. కేవలం  5 గురు ఎంపీ లు ఉన్న పార్టీల ను మాత్రమే అఖిల పక్ష సమావేశానికి పిలుస్తున్నారని, ఇపుడు నలుగురే ఎంపిలున్నందున టిడిపి ఆహ్వానం అందలదేని చెబుతున్నారు. 2 రోజుల క్రితమే టీడీపీ ఎంపీ సీతారామ లక్ష్మీ పదవీకాలం ముగియడంతో పడిపోయిన టీడీపీ ఎంపీల సంఖ్య నాలుగుకు పడిపోయింది. అయిత, టిడిపి వర్గాలు ఆంకా ఆశతోనే ఉన్నాయి.సాయంకాలం లోపు ఆహ్వానం అందవచ్చని భావిస్తున్నాయి.
పులివెందులో ఎనిమల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.  పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తికేంద్రంకోసం ఒప్పందం కుదిరింది.  2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ మొదలవుతుంది.  పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు ,అంటే
– గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్లరోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లుతయారవుతాయి. దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి తో   ఐజీవై ముందుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం  సదుపాయాలను అందిస్తుంది . ఇక్కడ  100 మంది నిపుణులకు, సిబ్బందికి ఉపాథి లభిస్తుంది.
.