చైనా ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది, పూర్తవుతుందా? ఇండియా-చైనా బిజినెస్ ఇదే…

గాల్వాన్ లోయ రక్తపాతం, ఇరవై మంది భారత సైనికుల దుర్మరణంతో ఆగ్రహించిన భారత చైనా మీద ఎదురుదాడి ప్రారంభించింది. ఇది మిలిటరీపరంగానే కాదు, వాణిజ్య పరంగా ఈ దాడి మొదలయింది. దేశ ప్రజల్లో కూడా ఇదే సెంటిమెంట్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో చైనా ఉత్పత్తులను బహిష్కించాలని ప్రచారం చేస్తున్నారు. సోమవారం నాటి దాడి తర్వాత ఇది తీవ్రమయింది.
బుధవారం నాడు భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తులు బహిష్కరించేందుకు చర్యలు మొదలు పెట్టింది. మొదట భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కు ఈ ఆదేశాలు వెళ్లాయి. బిఎస్ ఎన్ ఎల్ ఇక మేడ్ ఇన్ చైనా పరికరాలను వాడవద్దని స్పష్టమయిన ఆదేశాలిచ్చారు. బిఎస్ ఎన్ ఎల్ 4G బిజినెస్ లోకి మారాలనుకుంటున్నది . అందువల్ల చైనా పరికరాలను వాడే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ పరికరాలను కొనుగోలుచేసేందుకు టెండర్లను జారీచేసి ఉంటే వాటిని సవరించాలని కూడా ఈ సంస్థకు సూచనలిచ్చారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఇది ఇతర రంగాలకు విస్తరించినిజంగా చైనా ఉత్పత్తుల సంపూర్ణ బహిష్కరణ దారితీస్తుందా?
అయితే, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ చాలా తీవ్రంగా ఉన్న ఆ పనిచేయడం మాట్లాడినంత సులభం కాదని ఎకనమిక్ టైమ్స్ రాసింది. ఎందుకంటే రెండుదేశాల మధ్య సంబంధాలు అంత లోతుకు వేళ్లూని కుని ఉన్నాయి. చైనానుంచి రాడార్ల ట్రాన్సిమిషన్ పరికరాలు, న్యూక్లియార్ రియాక్టర్లు టివిలు, కెమెరాలు, ఎలెక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్స్, మైక్రోఫోన్లు,హెడ్ ఫోన్లు, లౌడ్ స్పీకర్లు,రసాయనాలు… పరిశ్రమల విడిభాగాలు .. ఇలా లెక్కలేనన్ని ఉత్పత్తులు భారత్ దిగుమతి చేసుకుంటుంది.
Exit the Dragon (source: Amul)
ఉదాహరణకు కొన్ని రకాల కీలకమయిన చైనా ఉత్పత్తులను చూద్దాం. ఎకనమిక్ టైమ్స్ ప్రకారం క2019లో భారత్ చైనా నుంచి 13.87 బిలియన్ డాలర్ల విలువయిన న్యూక్లియార్ రియాక్టర్లను దిగుమతి చేసుకుంది. పంటల దిగుబడిని పెంచేందుకు వాడే ఎరువుల తయారీకి అవసరమయిన డైఅమ్మోనియం ఫాస్ఫేట్ ను,యూరియాను భారత్ చైనానుంచే దిగుమతి చేసుకుంటుంది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్లు, వెంటిలేర్స్, N95 మాస్కులు, మెడికల్ కిట్లు … ఎన్నో చైనా నుంచి దిగుమతి అవుతాయి.
2018, జూలై 26న భారత పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ (ఛెయిర్మన్ నరేష్ గుజ్రాల్ ) Impact of Chinese Goods on Indian Industry మీద ఒక నివేదిక (145 వ రిపోర్టు) సమర్పించింది.

https://trendingtelugunews.com/english/features/irriation-project-pushed-to-back-burner-in-jaganmohan-reddys-budget/

ఈ నివేదిక ప్రకారం 2007-08 నుంచి 2017-18 మధ్య చైనా నుంచి ఇండియాకువచ్చే సరకుల విలువ 50 బిలియన్ డాలర్లు కు పెరిగింది. ఇదే కాలంలో భారత్ నుంచి చైనా సాగే ఎగుమతులు కేవలం 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే పరిగాయి. అంటే భారత్ చైనాల మధ్య వాణిజ్య లోటు బాగా ఉందున్న మాట.
In 2013-14, the Chinese import was approximately to the tune of about 11.6 % of all Indian imports. Moving on to 2017-18, it has increased to about 16.6%. The annual year-on-year growth in Chinese imports was about 9% in 2013-14 and this has risen to 20% in 2017-18. The trade deficit with China at USD 63 billion constitutes more than 40 per cent of India’s total trade deficit.(Source: Parliament of India Rajya Sabha, Report No 145)
ఇండియాలోని ఫార్మష్యూటికల్ పరిశ్రమలు చైనా మెటీరియల్స్ మీద బాగా ఆధారపడి ఉండటాన్ని కమిటీ కనుగొనింది. కొన్ని రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లో 90శాతం దాకా భారత్ చైనా మీద ఆధారపడింది. ఇక సోలార్ ఇండస్ట్రీ 84 శాతం దాకా చైనా ఉత్పత్తుల మీదే ఆధారపడిఉంది. భారతీయ వస్తువుటకంటే చైనా ఉత్పత్తుల క్వాలిటీ తక్కువ అని చెబుతూనే చైనా ఉత్పత్తుల స్థానంలోకి దేశీయ ఉత్పత్తులు రావాలంటే చాలా కాలం పడుతుందని, దీనికి భారీగా పెట్టుబడులు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరమని, వీటిని కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నరేష్ గుజ్రాల్ కమిటీ పార్లమెంటుకు సిఫార్సు చేసింది. భారతీయ విధానాలు కూడా చైనాకు అనుకూలంగా ఉండటం పట్ల కమిటి ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఈ స్టోరీ మీకు నచ్చిందా? మీ మిత్రులకు షేర్ చేయండి!

It finds it unfortunate that in the name of Ease of Doing Business, we are more than willing to give market access to Chinese goods which is destroying our manufacturing while China is smartly protecting its industry from Indian competition. The Committee strongly recommends that BIS must also reciprocate in the same manner as the Chinese.(Source: Parliament of India Rajya Sabha, Report No 145)
భారతీయ మార్కెట్ లోకి చైనా బాగా చొచ్చకుని వచ్చింది. అందువల్ల ఎవో కొన్ని యాప్ లు రిమూవ్ చేసి చైనా వస్తువులను బహిష్కించామనుకోవడం వేరు, నిజంగా చైనా ను భారతీయ మార్కెట్ నుంచి తరిమికొట్టడం వేరు. మొదటి సులభం, రెండో ది కష్టం. ఎందుకంటే, ఒక ఉదాహరణ చూద్దాం: LED బల్బులను తీసుకుందాం. భారతదేశంలో విద్యుత్ ను ఆదా చేసేందుకు ఎల్ ఇ డి బల్బులను వాడాలని విపరతంగా క్యాంపెయిన్ చేశారు. బాగా విజయవంతమయ్యారు కూడా. అయితే, ఈ ఎల్ ఇ డి బల్బులలో వాడే దాదాపు 30 శాతం ఎలెక్ట్రానిక్ డ్రైవర్స్ వంటి విడిభాగాలు చైనా నుంచే దిగుమతవుతాయి. చైనా లో కరోనా వల్ల ఈ విడిబాగాల సరఫరా ఆగిపోయి ఎల్ ఇ డి బల్బుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన కూడా  ఒక దశలో మొదలయింది.
2014 నుంచి భారతదేశంలో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఈ విషయాన్ని అనంత క్రిష్ణన్ బ్రూకింగ్స్ ఇండియాకోసం రాసిన ఒక పరిశోధనా ప్రతంలో పేర్కొన్నారు. ఇది లాక్డౌన్ ప్రకటించేముందే అచ్చయింది. 2014 లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడే నాటికి భారతదేశంలో చైనా పెట్టుబడులు 1.6 బిలియన్ డాలర్లే. మూడేళ్లలో ఇది 8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇవన్నీ నేరుగా వచ్చిన పెట్టుబడులు.
In greenfield investments and capital invested in acquiring or expanding existing facilities in India, Chinese companies have invested at least US$4.4 billion. Chinese companies have also invested in acquiring stakes in Indian companies, mostly in the pharmaceutical and the technology sectors, and participated in numerous funding rounds of Indian startups in the tech space. Another US$15 billion approximately is pledged by Chinese companies in investment plans or in bids for major infrastructure projects that are as yet unapproved. Source: Brookings

Featured Image Source: pmindia.gov.in