తెలంగాణ ఎమ్మెల్యేలకు యశోదా హాస్పిటల్ లోచికిత్స, ప్రజలకేమో గాంధీలోనా అనే ప్రశ్న గత రెండు మూడు రోజులుగా వినబడుతూ ఉంది.సోషల్ మీడియా దీని మీద విపరీతంగా చర్చ నడుస్తూఉంది. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోవిడ్ తో ట్రీట్ మెంట్ కోసం కార్పొరేట్ ఆసుప్రతిలో చేరారు. అంత ముందకు బిజెపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోవిడ్ తో అపోలోచేరారు. అంటే వీరెవరికి ప్రఖ్యాత గాంధీ ఆసుపత్రిమీద, అక్కడి వసతులు మీద, అక్కడి డాక్లర్ల మీద నమ్మకం లేదనేగా అర్థమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు నమ్మకం లేని ఆసుపత్రికి ప్రజలను పంపడం మంటే వాళ్ల ప్రాణాల మీద గౌరవం లేదనేగా!
ఎమ్మెల్యేలను గాంధీ ఆసుపత్రిలో ఎందుకు చికిత్సచేయించరు? ఎంత పెద్దోడయినా, కోటీశ్వరడైనా కోవి్ సోకితే గాంధీ లోనే చికిత్స అని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలోచేసిన ప్రకటన ఏమయింది?
పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయమా అంటూ ఈ వ్యక్తి నిరసన తెలుపుతున్నాడు.
ఆయన డిమాండ్లు ఇవి:
1. ప్రతిరాజకీయ నాయకునికి కూడా గాంధీ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ అందించాలి.
2. ప్రజలకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయమాఝ
3. గాంధీ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందించడంలేదని అంగీకరించి కరోనా వల్ల గాంధీ లో చనిపోయిన వారందరికి రున 10 లక్షల ఎక్స్ర్ గ్రేషియా చెల్లించాలి
4. కరోనా సోకిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగాం), బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గార్లకు అన్ని సౌకర్యాలున్న గాంధీ హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి.
5. ప్రభుత్వానికి ప్రభుత్వం డాక్టర్ల మీద నమ్మకం లేనపుడు ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుంది?
6.గాంధీలో చికిత్స పొందుతున్న కరోనాపేషంట్ లను అందరిని యశోదకు షిఫ్ట్ చేయాలి.