వ్యక్తిగతంగా తమ సమస్యలు చెప్పుకోలేని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల నుంచి సలహాలు, సూచనలు, తెలుసుకోవడానికి టీటీడీ ఒక యాప్ విడదలు చేసింది.
ఈ యాప్ ను మంగళవారం తాడేపల్లి లోని తన నివాసంలో టిటిడి ఛెయిర్మన్ వైసి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులు, ప్రజలు, తనను వ్యక్తిగతంగా కలసి తమకు ఎదురయిన సమస్యలను వివరించేందుకు, టిటిడి సేవలను మెరుగుపరిచేందుకు అవసరమయిన సూచనలుసలహాలు చేసేందుకు వ్యయ ప్రయాసలు పడకుండా వారికి మరింత దగ్గర కావడానికి ఈ యాప్ ను తయారుచేశామని ఆయన చెప్పారు.
ఈ యాప్ ద్వారా శ్రీ వారి భక్తులు తిరుమల తో పాటు అనుబంధ ఆలయాలు, టీటీడీ పరిపాలనకు సంబంధించిన సలహాలు, సూచనలు తన దృష్టికి తేవచ్చునని ఆయన చెప్పారు.
తిరుమల ఆలయాలలో తమకు ఎదురయిన ఇబ్బందులు కూడా తెలియజేయవచ్చునని ఆయన అన్నారు.
టిటిడి పాలనలో సమస్యలు మరింత వేగంగా పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గూగుల్ ప్లే స్టోర్ , లేదా ఆపిల్ ఐ స్టోర్ లో yvsubbareddy అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.