పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆయన వయసు 40 సంవత్సరాలు.
తను ఆరోగ్యం బాగా లేదని బాగా వొంటినొప్పులున్నాయనిదీనితో కోవిడ్ పరీక్ష చేయించాల్సి వచ్చిందని చెబుతూ దురదృష్టవశాత్తు నేను కోవిడ్ నని ఆయన ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన కోరారు.
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately, I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah అని ఆయన ట్వీట్ చేశారు.
1996 లో ఆయన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1998-2018 మధ్య ఆయన పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించారు. 27 టెస్టులు, 398 ఒడిఐలు, 99 టి20ఐ లు ఆడారు. పాకిస్తాన్ కరోనావైరస్ బారిన పడిన క్రికెటర్లలో అఫ్రిది ఐదో వ్యక్తి. అంతర్జాతీయ క్రికెట్ లోఆయనొక సంచలనం.16వ యేటనే సెంచురీ కొట్టారు.
కరోనా వైరస్ బారిని పడిన వారి ఆదుకునేందుకు సాయం చేయండని ఆయన చాలా రోజులు క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సాటి క్రికెటర్ల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది.
“We had to keep safety in mind. But people needed that help. This country has given me everything, so it is my duty that I help the people in times of crisis. The campaign is going on really well and my friends are also backing me to the hilt, “అని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్లు crickepakistan రిపోర్టు చేసింది.
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah #COVID19 #pandemic #hopenotout #staysafe #stayhome
— Shahid Afridi (@SAfridiOfficial) June 13, 2020