తాడిపత్రి : తెలుగు దేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అష్మిత్ రెడ్డిలను హైదరాబాద్ లోని ఆయన నివాస గృహంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
వారిని హైదరాబాద్ నుండి అనంతపురం కు తీసుకువచ్చి కోర్టుకు హాజరు సోమవారం నాడు కోర్టు ముందు హాజరు పరిచేఅవకాశాలున్నాయి.
కింజారపు అచ్చన్నాయుడి తర్వాత జరిగిన మరొక ముఖ్యమయిన అరెస్టు ఇది. కింజారపు ఎర్రన్నాయుడి కుటుంబం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టికి పెద్ద అండ. ఎర్రన్నాయుడు ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆకుటుంబానికి చాలా రాజకీయపలుకుబడి మిగిలించివెళ్లిపోయారు. ఈ కుటుంబంలో అంతా మాంచి గొంతున్న వాళ్లు. ప్రత్యర్తుల మీద నిప్పులు కురిపించగలరు. దీనితో అచ్చన్నాయుడు చాలా ఉత్తరాంధ్ర సేనాని అయ్యారు.
ఇలాగే, రాయలసీమలో లేదా అనంతపురం జిల్లాలో జెసికుటుంబం టిడిపికి పెద్ద అండ అయింది. ముఖ్యమంత్రి జగన్ కుటుంబంతో జెసి కుటుంబానికి ఎప్పటినుంచో విబేధాలున్నాయి. బాగా ధన బలం, జనబలం ఉన్న జెసి కుటుంబమే రాయలసీమలో జగన్ కి గుచ్చుకునేలా ధైర్యంగా విమర్శించగలిగే సత్తా ఉన్నకుటుంబం.
https://trendingtelugunews.com/telugu/breaking/atchanniaud-is-a1-in-esi-scam-acb-jd-ravikumar/
బలమయిన తెలుగుదేశం కుటుంబాలను బలహీనపర్చడం ద్వారా జగన్ టిడిపిని దెబ్బతీయాలనుకుంటున్నట్లు ప్రభాకర్ రెడ్డి, అచ్చన్న అరెస్టులతో అర్థమవుతంది.
సాధారణంగా రాజకీయాలను ప్రతివూర్లో కొన్ని కుటుంబాలే శాసిస్తూ ఉంటాయి. సర్పంచు రాజకీయాల నుంచి ఎంపి రాకీయాలదాకా ఈ డైనాస్టీలే కనపడతాయి. ఇలా జిల్లాకొక నాలుగుయిదు కుటుంబాలే అధికారంలోకి వస్తుంటాయి,పోతుంటాయి. మరొక కుటుంబానికి ఈహోదా రావడం చాలా కష్టం.
తాను వేసుకుంటున్న దారికి అడ్డొస్తున్న టిడిపి రాజకీయ కుటుంబాలను జగన్ పక్కకు తొలగించాలనుకుంటున్నారా?
అవినీతి ఒక ఆయుధంగా వాడుకుని ఈ కొత్త వ్యూహం అమలుచేస్తున్నారా?
గత నాలుగయిదు దశబ్దాలుగా తాడిపత్రి రాజకీయాలను నేరుగా, జిల్లా రాజకీయాలను పరోక్షంగా నడిపినకుటుంబం జెసి బ్రదర్స్ ది. ఇంతవరకు ఈ కుటుంబాన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు. అందువల్ల జెసి పట్లు రాజకీయాల్లోనే కాదు, వ్యాపార రంగంలో కూడా సాటిలేనిదిగా నిలబడింది.
అనంతపురం జిల్లాలో మరొక బలయమయిన రాజకీయ కుటుంబ పరిటాల కుటుంబం. జెసి కాంగ్రెస్ లో ఉన్నపుడు పరిటాలకు కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉండింది. మాజీ తెలుగుదేశం మంత్రి అయిన పరిటాల రవి మరణం తర్వాత ఈ కుటుంబం రాజకీయంగా బలహీన పడింది. రవి భార్య సునీత రాజకీయ వారసత్వం తీసుకున్నా, ఈ కుటుంబం పలుకుబడి పెరగలేదు. ఈ జగన్ రాజకీయల్లోకి రావడంతో జెసి కుటుంబం తెలుగుదేశం లోకి వచ్చింది. తెలుగుదేశం అధినేతచంద్రబాబు నాయుడు జెసి కుటుంబానికి అండగా నిలిచారు. దీనితో పరిటాల కుటుంబ రాజకీయచరిత్ర ముగిసింది.
సీటీలలో వ్యాపారాలు విపరీతంగా పెరిగిపోవడంతో రాయలసీమ గ్రామ ఫ్యాక్ష న్లు బలహీన పడటం, దానితో ఫ్యాక్షన్ కుటుంబాలూ బలహీనపడటం మొదలయింది.
మొన్న పరిటాల కుటుంబం ఇపుడు జెసి కుటుంబం బలహీన పడిటంతో వైసిపిని రాజకీయాల్లో ఎదరించే కమ్మ, రెడ్డి కుటుంబాలు ఇక మాయమయినట్లే.
ఈ కుటుంబాల వారసులు వ్యాపారాల్లో రాణించగలరే మో గాని, రాజకీయాల్లో వాళ్ల తండ్రులకు వారసులు కాలేకపోవడం చూస్తున్నాం.
వైసిపి రైవల్ గా ఉన్న మరొక రాజకీయ కుటుంబ కర్నూలు జిల్లాలో ఉంది. ఇది కెయి కృష్ణ మూర్తి కుటుంబం. నిజానికి , వ్యక్తిగతంగా ఈ కుటుంబానికి, వైఎస్ ఆర్ కుటుంబంతో ఎపుడూ పేచీలేదు. ఇది ప్యూర్ రాజకీయ వైషమ్యమే. ఇంకా స్పష్టంగా చెబితే మిత్రబేధమే. తొలినాళ్లలో వైఎస్ ఆర్, కెయి కృష్ణ మూర్తి మంచి స్నేహితులు కూడా. కాకపోతే, కెయి నాటి కాంగ్రెస్ లో నాటి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి తో ఉన్న వైరుధ్యం కారణంగా టిడిపిలోకి వచ్చారు. అట్లే ఉండిపోయారు. కాబట్టి కెయి కుటుంబాన్ని జగన్ రాజకీయంగానే చూడొచ్చు తప్ప ఫ్యాక్షన్ కక్షలతో చూడక పోవచ్చు.
అదే విధంగా కెయి కుటుంబం జగన్ తో కయ్యానికి కాలు దువ్వకపోవచ్చు. ఇంటి పెద్ద కెయి కృష్ణమూర్తి ఆరోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు దూరమయినట్లే. ఇక ఆయన తమ్ముళ్లు తెలుగుదేశంలో ఉంటే ఉండవచ్చ లేకపోతే లేదు.
కెయి తమ్ముళ్ల హయాంలో కెయి కుటుంబ ప్రాబల్యం పెరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్లు కూడా రాజకీయాల్లో నాటుకు పోలేకపోయారు. తమ్ముళ్లు కెయి ప్రభాకర్, ప్రతాప్ అన్నచాటు తమ్ముళ్లలాగే పెరిగారు. నాటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు.
కింజారపు, జెసి కుటుంబాలను చూసినట్లు జగన్ కెయి కుటుంబం మీద పగసాధిస్తారా అనేది అనుమానమే. కెయి కుటుంబం తెలుగుదేశం నుంచి ఇనాక్టివ్ అయితే చాలు జిల్లాలో కండబలం ఉన్న కుటుంబం అండ టిడిపికి పోతుంది. జగన్ కు ఇది చాలు. కాటట్టి కెయి కుటుంబాలన్ని ‘చర్చ’ల ద్వారానే దారికి తెచ్చుకోవచ్చు.
ఇక మళ్లీ, జెసి విషయానికి వస్తే, లారీల అమ్మకాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు జెసి దివాకర్ రెడ్డి మీద ఆరోపణలున్నాయి. బిఎస్ 3 వాహనాలను బిఎస్ 4 వాహనాలని చెప్పి విక్రయించిన చాలా మంది లారీ వోనర్లు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట లారీ వోనర్లు జెసి ఇంటి ముందు ధర్నా కూడ చేశారు. దీనితో జెసి బ్రదర్స్ మీద చీటింగ్ కేసునమోదు చేశారు. ఈకేసుకు సంబంధించే ఈ రోజు ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
విచారణ ఎదుర్కొనేందుకు తాను పోలీసుల ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించినా అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన అన్నకుమారుడు, మొన్న లోక్ సభ ఎన్నికల్లో అనంతపూర్ నుంచి పోటీచేసి వోడిపోయిన టిడిపి నేత జేసీ పవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
‘విచారణకు హాజరవుతానని పోలీసులకు పోలీస్ పలుసార్లు తెలియజేసినా అవసరం లేదని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం ఏమిటి? అసలు సూత్రధారులను వదిలివేసి బాధితుడైన తన చిన్నాన్నను అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష కాకఏమవుతుంది,’ పవన్ ప్రశ్నించారు.
అసలు కంపెనీయే తమని మోసం చేసిందని, మోసపూరితంగా తమకు వాహానాలను అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని జేసీ పవన్ రెడ్డి చెప్పారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టకుండా, దుర్మార్గపు పాలన చేస్తున్నదని విమర్శించారు.