రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మదనపల్లి లో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసేందుకు చర్యలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఒక మెడికల్ కాలేజీ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటవుతున్నది. ఇద చిత్తూరు జిల్లాలోనే ఉన్నా, కడపజిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. ఈ రోజు ఏపి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, చిత్తూరు జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.. నారాయణ స్వామి లతో కలసి మెడికల్ కాలేజీ స్థలం పరిశీలనకు వచ్చారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, శాసనసభ్యులు ఎం నవాబ్ బాషా, ద్వారక నాధ్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మ o, ఇతర అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
https://trendingtelugunews.com/telugu/breaking/atchanniaud-is-a1-in-esi-scam-acb-jd-ravikumar/
ఉప ముఖ్యమంత్రి నాని మదనపల్లి రూరల్ మండలం సాని టోరియం, వెంకటప్ప కోట, రాచవేటి వారి పల్లి గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు.
మదనపల్లి చాలా వెనుక పడ్డ ప్రాంతం. పేదలకు అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవ ల సి న పరిస్థితి. మారు మూల ప్రాంతంలో నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి సంకల్పం. మదనపల్లి లో వైద్య కాలేజీ ఏర్పాటు అవసరం ఉంది అని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆళ్ల నాని అన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల చిత్తూరు, కడప జిల్లాలలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, రాయచోటి, కదిరి నియోజకవర్గాలకు ఎంతో ఉపయోగమని ఆయన అన్నారు.
‘ ఇపుడు ఈ ప్రాంతంలో సరైన వైద్యం అందక పోవడం వల్ల ప్రజలు వందల కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.రానున్న మూడు సంవత్సరాలలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దృడ సంకల్పం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్మాణానికి ఆగష్టు లో టెండర్లు పిలుస్తాం. రాష్ట్రము లో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి 16వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయనున్నాం,’ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు.