టిడిపి ఎమ్మెల్యే అచ్చన్నాయుడిని అదుపులోకి తీసుకునే పోలీసుల తనకు ముందు నాకు సమాచారం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెల్లడించారు.
అచ్చన్నాయుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో,ఏ ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో ముందుగానే ఎసిబి డిజి,జైళ్ల శాఖ,సిఐయుయు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.
అచ్చెన్నాయుడు విషయంలో నిబంధనలు ప్రకారమే అధికారులు వ్యవహరించారని చెబుతూ అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, నేరాలకు బిసిలకు సంబందం ఏంటి ?అని స్సీకర్ ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడు బిసి అయితే చేసిన నేరానికి వదిలేద్దామా ? ఆని స్పీకర్ ప్రశ్నించారు. నేరస్థులకు కులం అపాదించి ఆయా వర్గాలను చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని అంటూ, అచ్చెన్నాయుడు నేరం చెయ్యకపోతే నేరం ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు.
స్పీకర్ తమ్మినేని సీతాాారాం ఇంకా ఏమన్నారంటే…
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్ఐ లో కుంభకోణం జరిగింది. ఇన్వెస్ట్గెటివ్ ఏజెన్సీలు ఏపీలో ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోంది. ఎసిబి అధికారుల ఫండమెంటల్ డ్యూటీని చంద్రబాబు రాజకీయాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. చేసిన నేరాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు బిసిల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.అచ్చెన్నాయుడు ఎవరో ఏంటో మేము చెప్పాల్సిన అవసరం లేదు.
ఎమ్మెల్యే గా ఉన్న నెరస్థుడిని పట్టుకొని స్వాతంత్య్ర సమర యోధుడుగా చిత్రీకరిస్తున్నారు. అచ్చెన్నాయుడు నేరం విషయంలో గాంధీ,పూలే,అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ చేస్తున్న ఆందోళనలు ఎస్సి, ఎస్టీ, బీసీలను అవమానించేలా ఉన్నాయి
అచ్చెన్నాయుడు నేరంలో లోతుగా విచారణ చేస్తే మని లాండరింగ్ చట్టంలో 3,4 సెక్షన్లు వర్తిస్తాయి. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి ఎవరి ఖాతాల్లో వేశారనే విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.
టెక్కలి చెందిన గ్రానైట్ వ్యాపారులు పాత్ర ఉందని సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో వాస్తవాలు తెలియాలని స్పీకర్ గా మీ ముందుకు వచ్చాను.
అచ్చెన్నాయుడు విషయంలో బిసిలు అనే ముందు స్కామ్ లో భాధితులగా ఉన్నది ఎవరో టీడీపీ నేతలు ముందు చెప్పాలి. బిసి పేరుతో ఎస్సి, ఎస్టీ, బిసిలకు చేరాల్సినవి బిసి పేరు చెప్పి దోచేస్తారా ? ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అనుమతించడం లేదు.
గవర్నర్ ప్రసంగం అన్ లైన్ ద్వారా
కరోన వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ప్రసంగానికి ఆన్లైన్ ద్వారా ఏర్పాట్లు చేస్తూన్నామని స్పీకర్ తెలిపారు.
సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలకు సభకు హాజరు కావాలని ఆహ్వానాలు పంపుతున్నామని ఆయన చెప్పారు. 175 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అసెంబ్లీలో 225 సీటింగ్ కెపాసిటీ ఉంది భౌతిక దూరం పాటించేలా సభకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.