తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… ఖండించారు. అసెంబ్లీ సమావేశాల ముందు కక్ష సాధింపులో భాగంగానే బీసీ నేత అచ్చెన్నాయుడు ని ముఖ్యమంత్రి జగన్ ఆయనను అరెస్ట్ చేయించారు. ఏడాది పొడుగునా రాష్ట్రంలో సాగుతున్న తుగ్లక్ పాలన, జరుగుతున్న అరాచకాలను,అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారని ఆయన ట్వీట్ చేశారు.
టిడిపి మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టు :ఎసిబి ప్రకటన
ట్వీట్టర్ లో లోకేష్ చేసిన కామెంట్:
బీసీ లకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు గతంలో ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు.లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే.
రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు.బడుగు,బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది.
అచ్చనాయుడిది కిడ్నాప్, జగనే బాధ్యత వహించాలి: చంద్రబాబు
శాసనసభాపక్ష ఉపనేత @katchannaidu గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపులో భాగంగానే @ysjagan బీసీ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు.(1/3) pic.twitter.com/jp4DqzQSiI
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 12, 2020
One thought on “అచ్చన్న అరెస్టు కక్ష సాధింపు: నారా లోకేష్…”
Comments are closed.