అచ్చన్నాయుడిని అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధఖ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ విశాఖలో ప్రకటించారు. ఈ సాయంకాలం ఆయనను విజయవాడలోని ఎసిబి కోర్టులో ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు.
కుంభకోణం ఇదీ
ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ సర్వీసెస్ విభాగంలో రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలు చేశారు.
టెండర్లు పిలవకుండా నిబంధనలను ఉల్లఘించి నామినేషన్ పద్దతిలో సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. ఇందులో పైస్థాయిఅధికారుల ప్రమేయం ఉందని, ఇది నాటి కార్మిక మంత్రి అచ్చనాయుడు అండదండలతో సాగిందని కూడా దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.
ఇంందులో అధిక మొత్తాల్లో నిధులు చెల్లించారని సుమారు రు .150 కోట్ల దాకా కుంభకోణం జరిగిందని విజిలెన్స్ దర్యాప్తు లో బయటపడందని చెబుతున్నారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో వారిలో అచ్చెన్నాయుడుతో పాటు తిరుపతికి చెందిన ఈఎస్ఐ డైరెక్టర్ సికే రమేష్ కుమార్, రాజమండ్రికి చెందిన విజయ్ కుమార్ ఉన్నారు.