రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్న ఇళ్లను ఇళ్ళ స్థలాలనుఅయిదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీనికి ఈ రోజు జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు చేశారు. ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాత లబ్ది దారులు అమ్ముకునేలా మార్గదర్శకాలను మార్పు చేశారు.
బిల్డ్ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాలను అమ్మకానికి కేబినెట్ ఓకే చేసింది. విశాఖపట్నంలో 7, గుంటూరులో 4 స్థలాల విక్రయానికి పెడతారు. అలాగే గుంటూరులో 1, విశాఖలో 3 చోట్ల గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్త ఎన్బీసీసీ ద్వారా అభివృద్ధి చేయడానిక్కిి రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. డెవలప్ చేసిన తర్వాత వీటిని ఇ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.గుంటూరులో 1 స్థలం అభివృద్ధి తాత్కాలికంగా నిలిపివేశారు.
తల్లుల చేతికి ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు
ఇక విద్యార్థుల తల్లుల చేతికే ఫీజు రియింబర్స్మెంట్ నిధులందిస్తారు. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్మెంట్ డబ్బును నేరుగా తల్లుల అక్కౌంట్లోకి పంపాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఒకె చేసింది. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే ఫీజురియంబర్స్మెంట్ డబ్బును తల్లులు ఖాతాల్లోకి వేస్తారు. కాలేజీల్లో వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న చదువులపై తల్లిదండ్రుల సమీక్ష, పరిశీలనకు ఈ విధానం ఉపకరిస్తున్నందన్న క్యాబినెట్ భావిస్తున్నది.
భోగాపురం ఎయిర్ పోర్టు కుదింపు
బోగాపురం ఎయిర్పోర్టులో లో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి అందిస్తారు. 2700 నుంచి 2200 ఎకరాలకు ఎయిర్పోర్టు కుదించాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కుదింపు స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ మేరకు జరిగిన తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు లభిస్తాయి.ఎకరం ధర రూ. 3 కోట్లు ధర వేసుకున్నా ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయంవస్తుందని, ప్రభుత్వంలో అవినీతి అన్నది లేకపోతే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో పైరెండు అంశాలు నిరూపిస్తున్నాయని కేబినెట్లో చర్చకు వచ్చిందని మంత్రి ఆళ్లనానివెళ్ల డించారు.