ఆంధ్రా నర్సింగ్ కాలేజీల్లో నియామకాలకు క్యాబినెట్ ఒకె

గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల క్రియోట్ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్  కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సమాావేశమయి అనేక కీలకనిర్ణయాలను తీసుకుంది. ఇందులో నర్సింగ్ కాలేజీలలో ఉన్న ఖాళీలను పూరించడం ఒకటి.
ఏలూరు, ఒంగోలు, తిరుపతి కాలేజీ ల్లో మరో 144 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఓకే చేసింది.
ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను మెరుగుపరచడానికి దృష్టిపెట్టిన ప్రభుత్వం  ఈ రిక్రూట్ మెంట్ లను తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఇదే విధంగా ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీస్‌కార్పొరేషన్‌ కోసం 55 పోస్టులను భర్తీచేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
దళారీలు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి,
అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల్లో అవినీతి లేకుండా చూడటానికి చర్యలు ఎపి అవుట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ కృషి చేస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తారు. ఇలాగే మొత్తం నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకింద తెలుగు, సంస్కృతం అకాడమీ సొసైటీ ఏర్పాటు చేయాలని  కేబినెట్‌ నిర్ణయించింది. ఈ అకాడెమీలు తిరుపతిలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.