శిద్ధా వైసిపిలో చేరడం వెనక మైనింగ్ రహస్యం ఇదే… : వర్ల

ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి  బెదిరించి లొంగదీసుకుని తెలుగుదేశం నాయకులను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని  టిడిపి అధికారప్రతినిధి వర్ల రామయ్య ఆరోపించారు.  మైనింగ్ వ్యాపారంలో ఉన్న  శిద్ధా రాఘవ రావును ఇలాగే అక్రమాల పేరుతో బెదిరించిన పార్టీలో చేర్చుకున్నారని ఆయన ఈ సాయంకాలం ఆరోపించారు.
వర్ల రామయ్య శిద్ధారాఘవరావు పార్టీ మార్పిడిన వెనక రాజకీయంగ గురించి  ఏమన్నారంటే:
ప్రభుత్వం సిద్దా రాఘవరావు మైన్స్ కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  అక్రమాలు జరిగాయని నోటీసులు ఇచ్చింది వాస్తవమా కాదా? లొంగదీసుకుని మీ పార్టీలో చేర్చుకున్న తర్వాత అక్రమాలన్నీ సక్రమాలు అయిపోతాయా?
జగన్ మోహన్ రెడ్డి ఈ రకమైన బ్లాక్ మైల్ పాలిటిక్స్ చేయటం, ఆస్తులు విధ్వంసం చేయడం ద్వారా తాత్కాలిక ప్రయోజనం పొందొచ్చునేమో గానీ ప్రజలు మాత్రం ఉపేక్షించరు.సరైన సంధర్బంలో తగిన బుధ్ధి చెబుతారు.
సరైన నాయకుడు దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాలి. ఈ ప్రభుత్వం చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను నమ్మి, ప్రజలను నమ్మి పోరాడాలి. వెళ్లిపోవడమంటే వారి చరిత్రను వారే దిగజార్చుకోవడమే.
సిద్ధా రాఘవరావుకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల గౌరవాలనిచ్చింది. జగన్ మోహన్ రెడ్డి బ్లాక్ మైల్స్ కు లొంగిపోవటం వలన ఇప్పటి వరకు ఆయనను ఆ స్థాయికి తీసుకొచ్చిన పార్టీకి, తనకు అన్ని రకాల అండదండలు ఇచ్చిన ప్రకాశం జిల్లా, దర్శి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు సంజాయిషి చెప్పాలి.
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి నేడు ఉత్తర కుమారుడు కన్నా దిగజారాడు.
ఏడాదిలో ఆయన విధ్వంస పరిపాలనకు ప్రజలలో వస్తున్న వ్యతిరేకతని దృష్టి మళ్లించడానికి ఫిరాయింపులను ఆశ్రయించి దిగజారాడు.
ఇలాంటి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, అనైతిక విధానాలకు పాల్పడుతున్న జగన్ దుశ్చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మేధావులు నిరసిస్తారు.