ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గములో400 కోట్ల రూపాయలతో అధునాతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ విషయం వెల్లడించారు.
మంగళవారం నాడు మార్కాపురం నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయడానికి రాయవరం కలుగజువ్వల పాడు గ్రామాల్లో భూములను ఆయన, రాష్ట్ర అటవీ,శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్,ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి లతో కలసి పరిశీలించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీ తో పాటు మరో 16 మెడికల్ కాలేజీ లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన చెప్పారు.
ఈ కాలేజీని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులకోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మార్కాపురం ను ఎంపిక చేశారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తారు.
ఇందులో భాగంగానే మార్కాపురం లొ రాయవరం, మేకలవారి పల్లి గ్రామాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం భూములు పరిశీలించడము జరిగిందని మె డికల్ కాలేజీ నిర్మిoచడానికి సాధ్యసాధ్యాలు పరిశీలించి ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాతామని నాని చెప్పారు.
ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ నిర్మించడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, రిమ్స్ హాస్పిటల్ సూపర్ ఇండెంట్ శ్రీరాములు , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పనాయుడు, ఎ. పి.వి.పి. కమీషనర్ వెంకట కృష్ణా,జిల్లాకో ఆర్డినెటర్ డ్రా. ఉషా,రిమ్స్ ఇ. ఇ రవి,మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ.ఎం.శేషి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.