ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయం మీద చర్చ జరుగుతున్నది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బోనాల పండగ నిర్వహించడం మీద అనుమానవ వ్యక్తం చేశారు. ఈ ఏడాది కి లేనట్లే అని సూచనప్రాయంగా చెప్పారు.అయితే, కాంగ్రెస్ అధికారి జి నిరంజన్ బోనాల పండగ జరపాలని, హైదదరాబాద్ కరుణించాలని అమ్మవారును కోరేందుకే బోనాల పండగ కాబట్టి నిషేధం ఉండరాదని చెబుతున్నారు. ఇలాగే చాలా యువజనసంఘాలు కూడా బోనాలు లేకపోతే ఎలా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నది.
జూన్ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ జరుగనుంది.
ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ghmc పరిధిలోని mlc లు, mla లు, పార్లమెంట్ సభ్యులు, ghmc కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్ లు పాల్గొంటారు.
వీరే కాకుండా గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకులు, పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో బోనాల ఉత్సవాల పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.