హైదరాబాద్ లో రాయలసీమ ‘పంచకట్టు దోశ’

చిలమకూరి నాగభరణ తాడిపత్రి యువకుడు. బి.టెక్ పూర్తి చేసాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేసాడు. 2014 ముందు నుండి రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ విషయంగా అనేక చోట్ల కార్యక్రమాలు జరిగాయి. ఇందులో హైదరాబాదు, సీమలో జరిగే కార్యకలాపాలలో భాగస్వామ్యం అయ్యాడు. రాయలసీమ ప్రాంత అస్తిత్వ స్పృహ కలిగించే ఎదో ఒక ప్రయత్నం చేయాలనుకొన్నాడు.
 అనంతపురం జిల్లా తాడిపత్రిలో రామన్న దోశ ప్రసిద్ది. ఆ స్ఫూర్తితో రాయలసీమ పంచెకట్టు దోశ టిఫిన్ హోటల్ ను హైదరాబాదు కేంద్రంగా, జూబ్లీ హిల్స్, రొ.నె:44, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సమీపాన చిన్నగా ప్రారంభించాడు. సీమ ప్రాంతంలోని టిఫిన్ వెరైటీలను నగరవాసులకు పరిచయం చేసాడు. సీమ సాంస్కృతిక ప్రచారం, జీవనోపాధి రెండు కలిసొచ్చాయి.

పీలేరు రాజమ్మ హోటల్ దోశ గురించి తెలుసా

ఇప్పుడు తన హోటల్‌ను మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.
రాయలసీమ ప్రాంత ప్రత్యేక వంటల పై చాలా వివరాలు సేకరించే పనిలో ఉన్నాడు. ఆ ప్రాంత మేధావులు సలహాలు తీసుకుంటున్నాడు. ఈ ప్రాంత వంటలపై ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొని రావాలని అతని సంకల్పం. ఆ మిత్రునికి చేదుడుగా, సీమ సాంస్కృతికోద్యమంలో భాగంగా  అదనపు సమచారం మరింత సమగ్రంగా సేకరిస్తున్నారు.

దోశాభిమానులకు ప్రత్యేకం…. దోశని ఫోల్డ్ చేసే అందిస్తారెందుకు?

సీమ ప్రాంత వంటల నిపుణులు, సాహిత్య సాంస్కృతిక పరిశోధకుల సాయం తీసుకుంటున్నారు. మరుగునపడిన లేదా మారుమూల ప్రాంతాలకే పరిమితమయిన వాటికి సంబంధించిన వివరాలు తెలియచేయాలకోరుతున్నారు. ఆయనకు పరిశోధకుడు, రచయిత, రాయలసీమ సాంస్కృతిక వేదిక నిర్వాహకుడు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి సహకరిస్తున్నారు. రుచులకు,వంటకాలకు సంబంధించి  సీమలో ప్రత్యేకంగా ఉన్నవి, వెలుగులోకి రానివి, ఒక కాలంలో సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

https://trendingtelugunews.com/telugu/round-the-clock-dosa-hotel-near-hyderabad-charminar/

1.రాయలసీమ సాహిత్యంలో, కైఫియత్తులు తదితరాలలో ప్రత్యేకంగా ఈ ప్రాంత వైవిధ్య వంటకాల వివరాలు కావాలి.
2. జానపదులు, గ్రామీణ ప్రాంతాలలో వివిధ వర్గాలలో విభిన్న వంటకాలు ఎలా ఉన్నాయి.
3. ప్రత్యేకించి మాంసాహార వంటకాలు ఏవి ఉన్నాయి. చాలా కాలం కడప,కర్నూలు, బనగానపల్లె నవాబుల పాలన ఇక్కడ ఉంది. ఆ ప్రభావంతో ఉన్న వంటకాలు ఏవి. ఈ సమాచారం తెలిసిన వాళ్లు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి,రాయలసీమ సాంస్కృతిక వేదిక ను  మొబైల్ నెంబర్ ‌ 99639 17187 లో సంప్రదించవచ్చు.