కరోనా పై న్యూజిల్యాండ్ విజయం : ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఎత్తేసిన ప్రధాని

కరోనా ను అదపు చేయడంలో న్యూజిల్యాండ్ విజయవంతమయింది. అక్కడ పాజిటివ్ కేసులు కనిపించడం లేదు. అనుమానిత కేసుల్లేవు. ఆసుపత్రుల్లో చికిత్సపోందుతున్న కేసులూ లేవు. ఒక్క మాటలో చెబితే చిన్న దేశం, సుందరమయిన దేశం, న్యూజిల్యాండ్ ఇప్పుడు కరోనాను దూరంగా పెట్టింది.
న్యూజిల్యాండ్ ఎంతగా విజయవంతమయిందంటే రెండువారాలుగా అక్కడ నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. ఈ విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆనందంతో చిందులేసినంత పని చేసిందట న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఈ రోజు నుంచి దేశంలో ఎలాంటి కరోనా సంబంధ ఆంక్షలుండవని ప్రకటించారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ విధిగా పాటించాల్సిన పని లేదని కూడా ఆమె ప్రకటించారు.
“We have eliminated tranmission of the virus for now. While the job is not done. This is a milestone.” అని చెబుతూ దేశంలో ఉన్న అంక్షలన్నీ ఎత్తివేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

https://www.facebook.com/jacindaardern/videos/260685465147014

సోమవారం అర్ధరాత్రి నుంచి దుకాణాలు, రెస్టరాంట్లు, కార్యాలయాలు, అన్ని మామూలుగా తెరచుకుంటాయి. సోషల్ డెస్టెన్స్ పాటిస్తేమంచిదే, కాని అదేమి నిబంధన కాదని ఆమె సోమవారంనాడు ప్రకటించారు.
న్యూజిలాండ్ కరోనా పాజిటివ్ కేసు నమోదు కాక 17 రోజులయింది. అంతేకాదు,ఫిబ్రవరి తర్వాత దేశంలో అసలు యాక్టివ్ కేసులు కూడా లేకపోవడమనేది ఈ సోమవారం విశేషం. దేశంలో విడుదలయిన చివరి కరోనా పేషంట్ ఆక్ ల్యాండ్ కు చెందిన మహిళ. ఈ విషయాలను ప్రకటిస్తూ ప్రధాని ‘Thank you New Zealand ” అని విలేకరులతో సమావేశంలో తన ప్రసంగం ముగించారు.
న్యూజిల్యాండ్ జనాభా 50 లక్షలు. అక్కడ 1500 మందికి కరోనా సోకింది. 22 మందిచనిపోయారు. అయితే, మించి కరోనా బీభత్సం సృష్టించకుండా  ప్రభుత్వం, ప్రజలు రంగంలోకి దూకి, కరోనా వ్యాపించే అవకాశాలన్నింటిని (coronavirus transimission chain) ను తుంచేశారు. అంతే.  కరోనా చచ్చి వూరకుండిపోయింది.
“Having no active cases for the first time since February 28 is certainly a significant mark in our journey, but as we’ve previously said, ongoing vigilance against COVID-19 will continue to be essential,” అని ప్రధాని తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్న న్యూజిల్యాండ్ హెల్త్ ఢైరెక్టర్ జనరల్ డాక్టర్ యాష్లే బ్లూమ్ ఫీల్డ్ అన్నారు.
దేశం కూడా విసిరేసినట్లు ఎక్కడో ఉండటం, సకాలంలో స్పందించి లాక్ డౌన్ ప్రకటించడం, ప్రధాని జెసిండా సమర్థవంతమయిన నాయకత్వం ఈ విజయానికి కారణమని మీడియా రాస్తున్నది.