టివి 5 చానెల్ కు పని చేస్తున్న మనోజ్ కుమార్ యాదవ్ (33) కోవిడ్-19తో మృతి చెందారు. పాజిటివ్ అని తేలిన 24 గంటలలోనే ఆయన మృతి చెందారు. ఆయన హైదరాబాద్ మాదన్న పేటలో నివసిస్తూ ఉంటాడు.మనోజ్ పోవడం యువజర్నలిస్టులకుషాక్. ఎందుకంటే, చూస్తుండగానే , రోజూ చలాకిగా తిరుగుతూ, సలహాలిస్తు,సాయం చేస్తూ ఉండే వ్యక్తి ఉన్నట్లుండి మటుమాయం కావడం భరించలేని వాస్తవం. మనోజ్ వృత్తిలోతీగెలాగ అల్లుకుపోయిన వారు. ఆయనకు ఎందరు మిత్రులో చెప్పలేం. ఇలాంటి వ్యక్తి కరోనా సోకడం, అంతలోనే ఐసియులోకి పోవడం, కాార్డియాక్ అరెస్టు రావడం అంతా సినిమా రీల్ లాగ జరజర నమ్మలేనంతా వేగంగా జరిగిపోయంది. అందుకే మిత్రులంతా షాక్ లో నుంచి కోలుకోలేకపోతున్నారు.సాధారణ కుటుంబమయినా, కుటుంబంలో ఎదురయిన విషాదాల మధ్య పెద్ద బాధ్యతలు మోస్తూన్న వాడు నిదానంగా నిబ్బరంగా చిరునవ్వు ను చెదరనీయకుండా బతుకువెళ్లదీస్తున్నవాడు మనోజ్. మనోజ్ అంటే సహచరుల్లో ఎనలేని అభిమానంకనిపించేందుకు ఇలాంటికారణాలెన్నో.
ఈ ఉదయం 9.30 కు గాంధీ ఆసుపత్రిలో ఐసియులో మనోజ్ కన్ను మూశారు. ఆయన డబుల్ న్యూమోనియా (బైలేటరల్ న్యూమోనియా), కోవిడ్ తో బాధపడుతున్నారని గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు.కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ దశలోనే ఆయన కరోనా సోకిందని చెబుతున్నారు.
ఆసుపత్రి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలగోతేదీన జ్వరంతో మనోజ్ ను ఫీవర్ ఆసుప్రతిలో చేర్పించారు. అయితే,ఇది కోవిడ్ కేసు అని గాంధీ ఆసుపత్రికి అదే రోజు తరలించారు. ఆయన కు ఊపిరాడకపోవడంతో ఐసియు కు తరలించారు. అక్కడ ఆక్సిజన్ అందించి ఆయనకు చికిత్స చేశారు. ఆయితే, ఈ ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో ఆయన చనిపోయాడని ఆసుప్రతి డిప్యూటీ సూపరింటెండెంట్ విలేకరులకు చెప్పారు.
ఆయన కు ముందే ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉంది. ఒక ఆపరేషన్ కూడా జరిగింది. థైమస్ గ్రంధి తీసేశారు. కోవిడ్ అని నిర్ధారించేటప్పటికి ఆయన ఈ కోమార్బడిటీస్ ఉన్నాయని ఆయన చెప్పారు. కేసులు వివరాలు. ఆయన మాటల్లోనే…
D.Manoj Kumar, 33 years,
Son of Yadappa, Siadabad, Hyderabad.
Admitted in Gandhi Hospital on 04/06/2020 at 12:40 Am .(referred from Fever hospital as COVID POSITIVE).
Immediately he’s admitted and treatment started. He developed breathlessness by afternoon on the same day of admission, and shifted to ICU. Since then he is in ICU only. His oxygen saturation was not maintained properly and with oxygen, saturations were maintaining. Team of doctors including Physicians, Anaesthetists, pulmonologists, have given round the clock service. I myself also visited him very frequently. But today morning, he had cardiac arrest & he was resuscitated but couldn’t be revived and declared dead at 9:37 am.
WHAT COULD BE THE REASON FOR THE DEATH OF YOUNG PERSON:
Manoj is already suffering from MYASTHENIA GRAVIS, in which all the muscles will have weakness including respiratory muscles . For this, he had surgery also (his thymus gland was removed), and he is on steroids for that condition.
With these comorbidities, he became COVID positive and had bilateral pneumonia with type 1 respiratory failure and ARDS.
We tried our best but couldn’t be revived: Dy suptd Gandhi Hospital.
మనోజ్ మరణం పట్ల తీవ్ర సంతాపం: టి జర్నలిస్టుల ఫోరమ్
సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ అకాల మరణం పట్ల టి జర్నలిస్టుల ఫోరమ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సహచరుడు, సౌమ్యుడు మనోజ్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వడంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులకూ రూ.50 లక్షల భీమా వర్తింప జేస్తూ జీవో విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ప్రతి జర్నలిస్టుకో వెంటనే కోవిడ్-19 పరీక్షలు నిర్బహించాలి.