రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా రాజకీయులు, పోలీసులు ఆన్లైన్ ద్వారానే ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ సూచించారు.
ఆయా ప్రెస్ మీట్ల కవరేజీకి వెళ్లడం ద్వారానే ఇప్పటికే పలువురు జర్నలిస్టులు కరోనా కాటుకు గురైనట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లోనే ఇవ్వాళ ఓ యువ పాత్రికేయుడు బలై పోయినట్లు వారు ఆవేదన చెందారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని వార్తల కవరేజీలో యాజమాన్యాలు జర్నలిస్టులపై ఒత్తిడి తేవద్దని కోరుతున్నాం. కరోనాతో మృతి చెందిన యువ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శేఖర్, విరాహత్ అలీలు విజ్ఞప్తి చేసారు.
https://trendingtelugunews.com/telugu/breaking/tv5-journalist-dies-of-covi-19/