*జూన్ 8 నుండి టిటిడి స్థానిక ఆలయాలలో ఎస్.ఎమ్.ఎస్ ద్వారా దర్శనం టికెట్లు
టిటిడి అనుబంధ ఆలయాలలో జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటల నుండి భక్తులకు ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాలలో స్వామివారి దర్శనానికి ఆన్‌లైన్, మొబైల్ ఎస్.ఎమ్.ఎస్, ఆలయాల ప్రాంగణంలో నిర్థేశిత పిఒఎస్ మిషన్‌ల ద్వారా భక్తులు ఉచితంగా దర్శనం టోకెన్లు పొందవచ్చు.
– ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్ https:/tirupatibalaji.ap.gov.in ద్వారా పై స్థానిక ఆలయాలలో దర్శనం టోకెన్లు పొందవచ్చు.
– ఫోన్ నెం.9321033330 కు ఎస్.ఎమ్.ఎస్ పంపి దర్శనం టోకెన్లు పొందవచ్చు. ఇందు కొరకు TTD(space)Temple Name(Space)Date(space)Namber of persons టైపుచేసి ఎస్.ఎమ్.ఎస్ చేయాలి.
ఉదాహరణకు – టిటిడి అనుబంధ ఆలయాలలో 11వ తేదీ 6 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎస్.ఎమ్.ఎస్ పంపు విధానం.
Ex- 1. TTD SVG 11.06.2020 6 (శ్రీ గోవిందరాజస్వామి ఆలయం – తిరుపతి)
2.TTD SVP 11.06.2020 6 (శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం – తిరుచానూరు)
3.TTD SVS 11.06.2020 6 (శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం – శ్రీనివాసమంగాపురం)
4.TTD SVK 11.06.2020 6 ( శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం – తిరుపతి)
5.TTD SVA 11.06.2020 6 ( ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం- అప్పలాయగుంట)
ఆలయాల దర్శనం వివరాలు –
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం – తిరుచానూరు
– ఉదయం 7.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరకు అమ్మవారి నైవేద్య విరామం.
– శుక్రవారం ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం – తిరుపతి
– ఉదయం 7.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామివారి కైంకర్యాల విరామం.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం – అప్పలాయగుంట
– జూన్ 8 నుండి 10వ తేదీ వరకు ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దర్శనం ఉంటుంది.
– జూన్ 11వ తేదీ నుండి ఉదయం 7.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామివారి నైవేద్య విరామం.
– శుక్రవారం ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దర్శనం.
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం – తిరుపతి
– ప్రతి రోజు ఉదయం 7.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 11.00 నుండి 11.30 గంటల వరకు స్వామివారి కైంకర్యాల విరామం.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం – శ్రీనివాసమంగాపురం
– ప్రతి రోజు ఉదయం 7.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామివారి కైంకర్యాల విరామం.
– శుక్రవారం ఉదయం 9.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు, శనివారం ఉదయం 8.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి దర్శనం.