విజయవాడ : ఉద్యోగరీత్యా కాని వ్యాపారరీత్యా గాని మరే ఇతర కారణం వల్ల గానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి స్థిరపడిన తెలంగాణ వారిని కూడా ఆంధ్రులుగా గుర్తించాలని ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం విజయవాడ సింగ్ నగర్ లోని ఎంపి టిఆర్ ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ అనే తారతమ్యాలకు ఇక తావులేదని తెలుగు వారు ఏ రాష్ట్రంలో సెటిలయినా ఆ రాష్ట్ర పౌరులుగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, తెలంగాణ అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ఏవిధంగా చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ఏపీలో కూడా తెలంగాణ వారిని ఆదుకోవాలని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.
లాక్ డౌన్ సమయం లో అటు ఇటు రాకపోకలు లేకపోవడంవల్ల సర్వే సమయంలో అందుబాటులో లేక తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలు అందని విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇప్పుడు మరలా వెరిఫై చేయించి వారికి కూడా సంక్షేమ ఫలాలు అందేవిధంగా సీఎం సహాయ సహకారాలు అందించాలని ఆదినారాయణ కోరారు.
https://trendingtelugunews.com/english/features/uncertainty-over-andhra-telangana-interstate-bus-services/