మే 27 వ తేదీన కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఒక గర్భిణి ఏనుగు హృదయ విదారకమయిన పరిస్థితులలో మరణించింది.
ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ ఏనుగు టపాసులు కూరిన పైనాపిల్ పండో మరోకటో తినింది, ఈ టపాసులు నోట్లో పేలడంతో తీవ్రంతా గాయపడి విలవిలలాడింది. ఏనుగు ఆ తర్వాత ఏమి తినలేకపోయింది. ఈ బాధను భరించేంందుకు అక్కడి నది నీళ్లలోనే ఉండిపోయింది. తొండాన్ని నీళ్లలోముంచి నొప్పితగ్గించుకునేందుకు ప్రయత్నించింది. ఆహారమేమీ తీసుకోలేకపోయింది. చివరకు మే 27 చనిపోయింది. దాని వయసులు 15 సంవత్సరాలు.
తొలుత, దీనిని చంపేందుకు ఎవరో ఈ పైనాపిల్ పండు తినిపించారని అని ప్రచారమయింది. ఈ వార్త దేశాన్ని కుదిపేసింది. కోట్ల సంఖ్యలో ప్రజలు స్పందించారు. ఆగ్రహంతో వూగిపోయారు. సికిందరాబాద్ నేరెట్ మెట్ కు చెందిన శ్రీనివాస్ వ్యక్తి దోషి ఆచూకిచెబితే రెండులక్షల రివా్డు ఇస్తానని ప్రకటించారు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్లు చేశారు.
ఏనుగు మరణం అందరిని బాధాంచింది. బాధపడిన వారిలో రతన టాటా, మేనకాగాంధీ లాంటి ప్రముఖలు కూడా ఉన్నారు. రాజకీయపార్టీల అభి మానులూ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో జంతు ప్రేమికుల ఆవేశం కట్లు తెంచుకుని ప్రవహించింది.
అయితే, ఇపుడుఅందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎనుగుకు ఎవరూ టపాసలు కూరిన పైనాపిల్ పండు తినిపించలేదు. ఈలాంటి పైనాపిల్ పండ్లను ఈ ప్రాంతం నుంచి తోడేళ్లు,ఎలుగుబంట్ల వంటి వన్యమృగాలను తరిమేందుకు వాడుతుంటారు. ఇలాంటి దానిని ఎనుగు తినిందని ఇపుడు చెబుతున్నారు. ఏనుగు చనిపోయేందుకు మాలప్పురం జిల్లా మీద కొంతమంది నిప్పులు చెరిగారు. మరికొందరు మాలప్పురాన్ని వివాదంలోకి లాగేడమేమిటని అడుగుతున్నారు. ఏనుగుచనిపోయింది పాలక్కాడులో అని వారు చెబుతున్నారు. ఇపుడిదొక చిక్కు ప్రశ్న.ఏనుగు చనిపోయిందెక్కడ, పాలక్కాడ్ జిల్లాయా, లేక మాలప్పురం జిల్లాయే..ఏనుగు విషాద గాథలో పడిన పెద్ద చిక్కుముడి.
మలయాళ మనోరమ (Malayala Manorama), ది లీడ్ (The Lede) దీని మీద కథనాలు ప్రచురించాయి. దిలీడ్ చాలా ఇన్వెస్టిగేట్ చేసి ఎనుగు ఎలా చనిపోయిందో, ఆ తర్వాత ఏం జరుగుతున్నదో చాలా విపులంగా రాసింది.
ఇపుడు ఎనుగు ఈ పైనాపిల్ పండును తినిందా, లేక తినిపించారా అనేది ఆవేశపూరితంగా జరుగుతున్న చర్చ. అదే విధంగా ఎనుగు చనిపోయింది పాలక్కాడ్ జిల్లాలోనా, మాలప్పురం జిల్లాలోనా అనేది కూడా మరొక ఉప చర్చ.
కొందరు చర్చను పాలక్కాడ్ జిల్లాకు పరిమితం చేసి ఎనుగుల మరణానికి, జంతుహింసకు ప్రాధాన్యం ఇస్తుంటే మరికొందురు చర్చను మాలప్పురానికి తీసుకు వెళ్లి దీని వెనక రాజకీయాలున్నాయని చెబుతున్నారు.మాలప్పురం జిల్లాకు అసలు జంతు ప్రేమ అనేది తెలియదని వారు వాదిస్తున్నారు.ఇలా వాదించిన వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి,బిజెపి ఎంపి మేనకా గాంధీ
Former Union Minister Maneka Gandhi termed the death of a pregnant elephant in Kerala after she ate cracker-stuffed pineapple allegedly given by a local as “murder” and said Malappuram was the “most violent district” in the country
Read @ANI Story | https://t.co/lXui57dRYG pic.twitter.com/Jbk4B9BiqZ
— ANI Digital (@ani_digital) June 3, 2020
ఈ నేపథ్యంలో మలయాళ మనోరమ, ది లీడ్ లు ఏనుగు మరణాన్ని మొదట ఫేస్ బుక్ పోస్టు చేసిన అటవీ శాఖ అధికారి మోహనన్ కృష్ణన్ తో మాట్లాడాయి. ఎనుగు మృతి కి దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నించాయి.
‘పాలక్కాడ్, మాలప్పురం జిల్లాల సరిహద్దున ప్రవహించే వెల్లియార్ నదిలో మే 26 సాయంకాలం ఈ గర్భిణి ఏనుగు కనిపించింది. దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గాయపడిన తొండం మీద ఈగలు వాలకుండా ఉండేందుకు అది తొండాన్ని నీళ్లలో ముంచినిలబడుకుని ఉంది. అది బాగా బలహీనంగా ఉంది. కడుపులోపలికి కుంచించుకుని పోయింది,’ అని మోహనన్ చెప్పారు.
( We found the pregnant elephant in velliyar river( near the border of Palakkad and Malappuram districts) on May 26 evening. Her condition looked so bad. She kept her trunk immersed in water to keep the flies that swarmed around her wound away. She looked weak with Shrunker stomach)
పాలక్కాడ్ ఫారెస్టు డివిజన్ కు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రెండు కుమ్కీ (Kumki)ఎనుగులను తీసుకువచ్చి నదిలో ఉన్న ఏనుగును కాపాడే ప్రయత్నం చేసింది. అయితే, ఈ ప్రయత్నాలు ఫలించలేదు. గాయాలబాధ భరించలేక మే 27 వ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు అది ప్రాణాలువిడిచిందని మోహనన్ మలయాళ మనోరమకు చెప్పాడు.
ఏనుగు శవాన్ని పోస్టుమార్టమ్ కు తీసుకుపోయేదాకా అది కడుపుతో ఉందన్న విషయంఎవరికీ తెలియదని కూడా మోహనన్ చెప్పాడు. అది గర్భవతి అని పోస్టు మార్టమ్ చూసిన వెటర్నరీ డాక్టర్ తనతో చెప్పాడని మోహనన్ అన్నాడు. తర్వాత ఏనుగుకు, గర్భస్థ శిశువుకు అంత్యక్రియలు జరిపారు.
కలచి వేసిన మోహనన్ ఫేస్ బుక్ పోస్టు
ఏనుగు చనిపోయాక మోహనన్ మనుసు కలచివేసే విధంగా ఫేస్ బుక్ లో ఒక పోస్టును మలయాళంలో పెట్టారు.
https://www.facebook.com/mohan.krishnan.1426/posts/2979525145456462