కోవిడ్-19 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షల మార్కును దాటింది. జూన్ 4 2020 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలు 4,13,773 లక్షలు కి చేరాయని కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు.
ఇందులో 4112 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 3377 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది , విదేశాల నుంచి తిరిగి వచ్చిన 119 మంది ఉన్నారు.
మే 1, 2020 నాటికి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ పరీక్షల సంఖ్య లక్ష దాటింది. సరిగ్గా నెల రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 4లక్షలు దాటింది.
దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పరీక్షల సంఖ్య ను మరింత వేగవంతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడంతో మొత్తం 4,13,733 కోవిడ్ టెస్ట్ ల మైలు రాయిని చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన కఠినమైన విధానాలతో పాటు ఎప్పటికప్పుడు కోవిడ్-19 పరీక్షలని పెంచుతూ ముందే అప్రమత్తమైంది.
ఒక మిలియన్ జనాభాకు ఆంధ్రప్రదేశ్ లో 7748 టెస్ట్ లు జరుగుతుండగా , భారతదేశంలో మన తరువాత 6864 టెస్టుల తో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.
దీంతో కోవిడ్ పాజిటివ్ కేసుల రేటు 1 కన్నా తక్కువ శాతం నమోదు అయ్యాయి.
అదే సమయంలో అత్యధికంగా డిశ్చార్జ్ రేటు ఉంటోంది. దీనివల్లే కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో ప్రపంచ మరియు జాతీయ సగటుతో పోల్చినపుడు రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉంది.