అనంతపురం కేద్రీయ విశ్వవిద్యాలయం కు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారి (TNR) పేరును నామకరణం చేయాలనిరిజర్వేషన్ల పరిరక్షణ సమితి (పిఆర్ ఎస్ ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈరోజు అనంతపురం లో RPS జాతీయ అధ్యక్షులు Dr. పొతుల నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టడం వల్ల విద్యార్థులకు విలువతో కూడిన జీవితం అలవడేందుకు వీలుంటుందని అన్నారు.
అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో సంపన్ను కుటుంబం లో జన్మించినా సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు గురించి సమ సమాజం కోసం ఉద్యమ బాటలో నడచిన గొప్ప విప్లవ వాది అని, దేశం నలుమూల నుంచి వచ్చే విద్యార్థులు ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందే వీలుకల్పించాలని నాగరాజు అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
తరిమెల నాగిరెడ్డి ఉన్నత విద్య ను అభ్యసించి నాలుగు పర్యాయాలు MLA, MP, పదవులు చేపట్టారు. ఇలాంటి వ్యక్తి జీవితం నేటి సమాజానికి తెలియాల్సి న అవసరం చాలా ఉంది, ఇప్పుడు ఉన్న రాజకీయలు సమాజానికి మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతున్నది.ఇప్పుడు ఉన్న యువత, విద్యార్థులు నాగిరెడ్డి పోరాట స్ఫూర్తి ని గాని, ఆయన నిజాయితీ, ఆయన సమాజానికి చేసిన త్యాగ నిరతి అలవర్చుకోవాలి. దీనికి కేంద్రీయ యూనివర్సిటీ కి TNR యూనివర్సిటీ గా నామకరణం చేయడం ఒక మార్గం. అక్కడి కి దేశ నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులు రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల కు తరిమెల నాగిరెడ్డి గారి చరిత్ర తెలుసుకోని మెరుగైన సమాజం కోసం వారు పని చేయాలనే తపన కొద్దీ మంది విద్యార్థులకు కలిగినా సమాజానికి మంచి జరుగుతుంది.
అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఉద్యమం చేపడుతున్న ది.
జిల్లా లో ఉన్న ఇద్దరు పార్లమెంట్ సబ్యులకు ఈ డిమాండ్ ను కేంద్రం మానవ వనరుల శాఖ మంత్రి గారికి విన్నవించాలని విజ్ఞప్తి చేస్తూన్నాం.
జిల్లా లో ఉన్న అన్ని వర్గాల మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు తో ముందుకు వెళతాం…. అని అన్నారు.
విలేకరుల సమావేశంలో RPS జాతీయ ప్రధాన కార్యదర్శి చిరుతల విఠల్ గౌడ్,ఉద్యోగుల నాయకులు జి.నాగభూషణం ,జాతీయ నాయకులు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జి.వాసు రాయల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు..